నాగార్జున సాగర్ డ్యాంలో 13 గేట్లను తమ ఆధీనంలోకి తీసుకున్న ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు నీటిని విడుదల చేసుకున్నాారు. తెెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ డ్యాం వివాదం కలకలం రేపింది.
నాగార్జున సాగర్ : తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ చిచ్చు రేపింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కృష్ణా నదిపై వున్న నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ నీటికోసం ఆంధ్ర ప్రదేశ్ అధికారులు పోలీసులను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో డ్యామ్ రక్షణ బాధ్యతలు చూస్తున్న తెలంగాణ పోలీసులు కూడా భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బుధవారం ఇరురాష్ట్రాల పోలీసుల మద్య నాగార్జున సాగర్ డ్యాం ప్రారంభమైన వివాదం గురువారమంతా కొనసాగింది.
ప్రాజెక్ట్ 26 గేట్లలో 13 గేట్లు ఆంధ్ర ప్రదేశ్ పరిధిలోకి వస్తాయని ఏపీ పోలీసులు వాదిస్తున్నారు. దీంతో ఇక్కడివరకు డ్యాం ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ పోలీసుల రక్షణలో వున్న సాగర్ ను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సాగర్ నీటిని విడుదల చేసే 13 గేట్ వరకు మళ్లకంచెలు వేసుకున్నారు. అంతేకాదు ప్రాజెక్ట్ వద్ద ఏర్పాటుచేసిన సిసి కెమెరాలను కూడా ధ్వంసం చేసారు.
undefined
ఏపీ ఉన్నతాధికారులు పోలీసుల సాయంతో నాగార్జునసాగర్ డ్యామ్ నుండి నీటిని విడుదల చేసుకున్నారు. తెలంగాణ పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఏపీ అధికారులు పంతం నెగ్గించుకున్నారు. గురువారం నాటకీయ పరిణామాల మధ్య ఒంగోలు చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకున్నారు.
Read More Nagarjunasagar : నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల...
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజనతోనే నాగార్జున సాగర్ డ్యామ్ పై వివాదం రాజుకుంది. ఈ ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతలను కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. అయితే తెలంగాణ ప్రభుత్వ నిర్వహణ వల్ల తమకు అన్యాయం జరుగుతోందని... తమ వాటా నీటిని కూడా ఇవ్వడంలేదని ఏపీ అధికారులు అంటున్నారు. దీంతో ఏకంగా పోలీసుల సాయంతో సాగర్ నే తమ స్వాధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేసారు.
నాగార్జున సాగర్ డ్యాంపై పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం గురించి తెలిసి మిర్యాలగూడ డిఎస్పీ వెంకటగిరి ఏపీ పోలీసులతో మాట్లాడే ప్రయత్నంచేసారు. నీటిపారుదల అధికారులు మాట్లాడుకుని ఈ వివాదాన్ని పరిష్కరించుకుంటారని... ముళ్ల కంచెను తీసేసి వెనక్కి వెళ్ళిపోవాలని ఏపీ పోలీసులకు సూచించారు. అయినప్పటికి ఏపీ పోలీసులు స్పందించకపోవడంతో ఉద్రిక్తతలు అలాగే కొనసాగాయి.