ప్రగతి భవన్ ముట్టడికి బీజేవైఎం యత్నం, ఉద్రిక్తత: అరెస్ట్ చేసిన పోలీసులు

By narsimha lode  |  First Published Jan 5, 2023, 12:09 PM IST

పోలీస్ కానిస్టేబుల్ నియామకాల విషయంలో  హైకోర్టు ఉత్తర్వులను  పాటించాలని  బీజేవైఎం డిమాండ్  చేసింది.  ఈ విషయమై ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు  ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్  చేశారు.


హైదరాబాద్:పోలీస్ కానిస్టేబుల్  నియామాకాల  విషయంలో  ప్రభుత్వ నిర్ణయాన్ని  నిరసిస్తూ  బీజేవైఎం నేతలు  గురువారంనాడు  ప్రగతి భవన్ ను  ముట్టడించేందుకు  ప్రయత్నించడంతో  ఉద్రిక్తత నెలకొంది.ప్రగతి భవన్ ముట్టడించేందుకు  వచ్చిన బీజేవైఎం శ్రేణులను  పోలీసులు  అడ్డుకున్నాయి.  పోలీసులకు  బీజేవైఎం శ్రేణుల మధ్య తోపులాట చోటు  చేసుకుంది. ఇరు వర్గాల  మధ్య  వాగ్వాదం జరిగింది.  ప్రగతి భవన్ వైపునకు  వెళ్లే ప్రయత్నం   చేశారు.   బీజేవైఎం శ్రేణులను అరెస్ట్  చేసి  పోలీసులు సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.  కానిస్టేబుల్ నియామకాల విషయంలో  గతంలో  ఉన్న  నియమాలనే కొనసాగించాలని  బీజేవైఎం నేతలు డిమాండ్  చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్ఐ  ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టింది.  పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు  ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.  సివిల్ పోలీస్ కానిస్టేబుల్ విభాగంలో  15,664,  ఎక్సైజ్  విభాగంలో  614,  రవాణా శాఖలో  63 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి  కటాఫ్ మార్కులను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది.   ఎస్సీ, ఎస్టీలకు  40 మార్కులు , బీసీలకు  50గా నిర్ణయించారు. ఓసీలకు  60 మార్కులను కటాఫ్ గా నిర్ణయించారు.

Latest Videos

undefined

కానిస్టేబుల్ పరీక్షల్లో  కొన్ని ప్రశ్నలు తప్పులుగా  ఉన్నాయని   కానిస్టేబుల్ అభ్యర్ధులు గతంలో  ఆందోళన నిర్వహించారు.  మరో వైపు గత ఏడాది డిసెంబర్ చివరి నుండి ఈ నెల మొదటి వారం వరకు  కానిస్టేబుల్ , ఎస్ఐ ఉద్యోగాల కోసం  అభ్యర్ధులకు ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టులు నిర్వహించారు. అయితే ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టులకు  సంబంధించి  లాంగ్ జంప్ వంటి పరీక్షలకు  3.8 మీటర్ల నుండి  4 మీటర్లకు పెంచారని  కానిస్టేబుల్ అబ్యర్ధులు  ఆందోళన చెందుతున్నారు. గతంలో  ఉన్నట్టుగానే  ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షలను  నిర్వహించాలని  బీజేవైఎం నేతలు డిమాండ్  చేశారు.ఇదే రకమైన డిమాండ్ తో   కాంగ్రెస్ నేతలు కూడా ఆందోలన నిర్వహించారు.  కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రయత్నించిన  అభ్యర్ధులకు  న్యాయం చేయాలని   కోరారు.


 

click me!