కరోనా ఎఫెక్ట్.. దక్షిణాఫ్రికాలో తెలంగాణ యువకుడి మృతి

Published : May 28, 2020, 07:54 AM ISTUpdated : May 28, 2020, 07:58 AM IST
కరోనా ఎఫెక్ట్.. దక్షిణాఫ్రికాలో తెలంగాణ యువకుడి మృతి

సారాంశం

లాక్‌డౌన్‌ని సడలించడంతో జూన్‌ 6న హర్షవర్ధన్‌రెడ్డిని ఇండియా పంపించేందుకు స్నేహితులు విమాన టికెట్‌ను బుక్‌ చేశారు. ఈ లోపు అతని ఆరోగ్యం క్షీణించింది. 

ఉన్నత చదువులు చదివి..  మంచి ఉద్యోగం సాధించాలని కలలు కన్నాడు. కన్న తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవాలని అనుకున్నాడు. కానీ.. కరోనా లాక్ డౌన్  రూపంలో మృత్యువు అతనిని కబళించింది. విదేశాల్లో ఓ తెలంగాణ యువకుడు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే...ఖమ్మం జిల్లా వైరా మండలం గరికపాడుకు చెందిన శీలం రమణారెడ్డి, కృష్ణకుమారి కుమారుడైన హర్షవర్ధన్‌రెడ్డి ఖమ్మంలో డిగ్రీ పూర్తిచేసి గతేడాది దక్షిణాఫ్రికా వెళ్లాడు.  అక్కడి మాలవీ ప్రాంతంలోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. 

అనారోగ్యానికి గురైన అతను స్వస్థలానికి రావడానికి 2నెలలుగా ప్రయత్నిస్తున్నాడు.  లాక్‌డౌన్‌ని సడలించడంతో జూన్‌ 6న హర్షవర్ధన్‌రెడ్డిని ఇండియా పంపించేందుకు స్నేహితులు విమాన టికెట్‌ను బుక్‌ చేశారు. ఈ లోపు అతని ఆరోగ్యం క్షీణించింది.  దాంతో కుటుంబ సభ్యులు ఎంపీ నామాను కలిసి హర్షవర్ధన్‌ను త్వరగా తీసుకువచ్చేందుకు సహకరించమని విజ్ఞప్తి చేశారు. 

నామా సానుకూలంగా స్పందించి ప్రయత్నాలు మొదలుపెట్టే లోపే  బుధవారం తెల్లవారుజామున ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హర్షవర్ధన్‌ మృతి చెందాడు. తమ కుమారుడి చివరి చూపునకు కూడా నోచుకోలేకపోయామంటూ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భౌతికకాయాన్ని స్వస్థలానికి రప్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్