జగిత్యాలలో కరోనాను జయించిన 104 ఏళ్ల బామ్మ..!

By telugu news teamFirst Published Jun 25, 2021, 9:32 AM IST
Highlights

ఆమెను జగిత్యాలలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యుల చికిత్స అనంతరం ఆమె కోలుకోవడం మొదలుపెట్టారు.  ఆమె వయసు ఎక్కువ కావడంతో.. ఆ విధంగా చికిత్స అందించామని వైద్యులు తెలిపారు.

కరోనా మహమ్మారి మన దేశంలో ఎంతలా విలయతాండవం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. కాగా.. ఈ మహమ్మారి కారణంగా ఎందరో యువకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కాగా... ఓ 104ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. ఈ సంఘటన జగిత్యాలలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రైకల్ మండలం, బోర్నపల్లి గ్రామానికి చెందిన చెన్నమనేని ఆండాలు అనే 104ఏళ్ల బామ్మ ఈ నెల 15వ తేదీన కరోనా బారినపడ్డారు. దీంతో... ఆమెను జూన్ 18న ఆమెకు జ్వరం తీవ్రత ఎక్కువైంది. బ్రీతింగ్ సమస్యలు కూడా వచ్చాయి. ఆమె ఎస్పీఓ2 లెవల్స్ కూడా 90 కన్నా తక్కువగా పడిపోయాయి.

దీంతో.. ఆమెను జగిత్యాలలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యుల చికిత్స అనంతరం ఆమె కోలుకోవడం మొదలుపెట్టారు.  ఆమె వయసు ఎక్కువ కావడంతో.. ఆ విధంగా చికిత్స అందించామని వైద్యులు తెలిపారు.  ఆరు రోజుల చికిత్స అనంతరం ఆమె పూర్తిగా కోలుకుంది. ఆమెకు కేవలం ఇంజెక్షన్స్, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ అందించామని వైద్యులు చెప్పారు. పూర్తి ఆరోగ్యంతో ఆమె కోలుకున్న తర్వాత.. డిశ్చార్జ్ చేశారు.

click me!