తెలంగాణలో కరోనా లేని గ్రామం.. ఏదో తెలుసా?

By AN TeluguFirst Published May 14, 2021, 3:30 PM IST
Highlights

కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తోంది. సెకండ్ వేవ్ తీవ్రంగా దేశాన్ని ప్రమాదం అంచుకు నెట్టేసింది. రూపం మార్చుకున్న కరోనా వైరస్ మందులకు లొంగక ముప్పుతిప్పలు పెడుతోంది. దీనికి తోడు కరోనా నుండి బయటపడ్డామన్న సంతోషాన్ని ఆవిరి చేస్తూ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ పొంచి ఉంది.

కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తోంది. సెకండ్ వేవ్ తీవ్రంగా దేశాన్ని ప్రమాదం అంచుకు నెట్టేసింది. రూపం మార్చుకున్న కరోనా వైరస్ మందులకు లొంగక ముప్పుతిప్పలు పెడుతోంది. దీనికి తోడు కరోనా నుండి బయటపడ్డామన్న సంతోషాన్ని ఆవిరి చేస్తూ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ పొంచి ఉంది.

ఈ ముప్పేట దాడిలో సామాన్యుడు ప్రాణాలు కోల్పోవడం మినహా మరేమీ చేయలేని నిస్సహాతలో పడిపోయాడు. ఎక్కడ చూసినా వందలు, వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్న వేళ తెలంగాణలోని ఓ గ్రామం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదవ్వకుండా ఆ గ్రామస్తులు కలిసి కట్టుగా జాగ్రత్తలు తీసుకున్నారు. అదే దమ్మాయి పేట. కరీంనగర్ జిల్లాలోని ఈ గ్రామం ఫస్ట్ వేవ్ లోనూ ఒక్క కేసూ నమోదు కాలేదు. ఇప్పుడు సెకండ్ వేవ్ లోనూ అదే కంటిన్యూ అవుతుంది. 

దీనికోసం గ్రామస్తులు, పంచాయతీ అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. సెకండ్ వేవ్ మొదలు కాగానే గ్రామపంచాయతీ నుంచి గ్రామస్తులందరికీ ఉచితంగా మాస్కులు పంచి పెట్టారు. ఇతర గ్రామాలనుంచి వచ్చేవారిని రాకుండా సరిహద్దుల్లో ఆడ్డుకట్టలు వేశారు.

చుట్టూ పచ్చని కొండల మధ్య ఉండే ఈ గ్రామంలో పిచికారీలు చేయడం,  గ్రామస్తులు కోవిడ్ నిబంధలను పాటించేలా అవగాహన కల్పించారు. మాస్కులు, శానిటైజర్ల ప్రాముఖ్యత మీద అవగాహన పెంచారు. 

నిత్యావసర దుకాణాలు కూడా సమయపాలన పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.  ఎప్పటికప్పుడు సోడియం హైపో క్లోరైట్ ద్రావణం పిచికారీ చేశారు. దీనికి ప్రజలు, యువత కూడా గట్టిగా కట్టిపడి ఉన్నారు. మారుమూల ప్రాంతంలో ఉండడం కూడా తమ గ్రామానికి కలిసి వచ్చిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 

click me!