డ్రంకైన్ డ్రైవ్ కేసులు: హైద్రాబాద్‌లో 5,819 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు

By narsimha lode  |  First Published Jan 1, 2023, 1:23 PM IST


కొత్త సంవత్సరం  సందర్భంగా  డ్రంకైన్ డ్రైవ్  చేసిన వారి డ్రైవింగ్ లైసెన్సులను  తెలంగాణ రవాణాశాఖ  రద్దు చేసింది.  నిన్న ఒక్క రోజే  5,819 మంది  రవాణా శాఖ రద్దు చేసింది. 


హైదరాబాద్: న్యూఇయర్  సందర్భంగా  మద్యం తాగి వాహానాలు నడిపిన  వారి  5,819 డ్రైవింగ్ లైసెన్సులను  రద్దు చేసింది తెలంగాణ రవాణా శాఖ.  కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకొని  పీకల వరకు  మద్యం తాగి  వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కిన వాహనదారులకు  షాక్ ఇచ్చింది రవాణాశాఖ. మద్యం తాగి వాహనాలు నడిపితే  డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తామని   అధికారులు  వార్నింగ్  ఇచ్చారు.హైద్రాబాద్ నగర వ్యాప్తంగా  నిన్నరాత్రి హైద్రాబాద్ పోలీసులు ప్రత్యేకంగా డ్రంకైన్ డ్రైవ్  తనిఖీలు చేపట్టారు.  మద్యం దుకాణాలు,  బార్లు,  పబ్ లకు సమీపంలో  రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేసి డ్రంకైన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.

హైద్రాబాద్  నార్త్ జోన్ లో  1,103, సౌత్ జోన్ లో  1,151,  ఈస్ట్ జోన్ లో 510, వెస్ట్ జోన్ లో 1345  డ్రైవింగ్ లైసెన్సులు  రద్దు చేశారు.నగరంలోని సంజీవరెడ్డినగర్ లో  73, పంజాగుట్టలో  51, బంజారాహిల్స్ లో  48, జూబ్లీహిల్స్  49 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు  చేశారు.  2021తో పోలిస్తే  ఈ ఏడాది  ఎక్కువగా  డ్రంకైన్ డ్రైవ్ కేసులు  నమోదయ్యాయి.  2021లో  3230 వాహనదారుల లైసెన్స్ ల రద్దయ్యాయి.కొత్త సంవత్సరం సందర్భంగా పబ్ లు, బార్లు, మద్యం దుకాణాలు అనేక ఆపర్లు ప్రకటించాయి 

Latest Videos

click me!