రాష్ట్ర పోలీసు శాఖ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్లు చెల్లించడంపై భారీ రాయితీని ప్రకటించింది. బైక్‌లకు, త్రీవీలర్లకు సంబంధించిన పెండింగ్ చలాన్లపై 80 శాతం, ఫోర్ వీలర్లకు 60 శాతం, హెవీ వెహికిల్స్‌కు 50 శాతం డిస్కౌంట్‌ను ఇచ్చింది.
హైదరాబాద్: తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పెండింగ్ చలాన్లపై గతేడాది కంటే కూడా సూపర్ డిస్కౌంట్‌ను ఇచ్చారు. ముఖ్యంగా బైక్‌లపై అత్యధికంగా డిస్కౌంట్ ఇచ్చారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులోకి రానుంది.
టూ వీలర్లు, త్రీ వీలర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న చలాన్లపై 80 శాతం డిస్కౌంట్‌ను ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఫోర్ వీలర్లు, హెవీ వెహికల్స్‌కు సంబంధించిన చలాన్లపై 60 శాతం, 50 శాతం రాయితీని ఇచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో భారీగా చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల చలాన్లపైగా పెండింగ్‌లో ఉండటంతో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
గతేడాది కూడా పోలీసు శాఖ ఇలాంటి ఆఫర్ ప్రకటించింది. అప్పుడు బైక్‌లపై 75 శాతం, మిగిలిన వాహనాలపై 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అప్పుడు ఈ ఆఫర్ 45 రోజుల వరకే ఇచ్చింది. తాజా ఆఫర్ ఎప్పటి వరకు అన్నది ఇంకా తెలియాల్సి ఉన్నది. గతేడాది డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించినప్పుడు సుమారు రూ. 300 కోట్ల మేరకు వసూలు అయ్యాయి. చాలా మంది వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
Also Read: Ayodhya: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సోనియా గాంధీ!.. ఆహ్వానంపై దిగ్విజయ్ సింగ్ కామెంట్
ఇలా కట్టుకోండి..
ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నిర్ణీత గడువులోపు.. డిస్కౌంట్ రేట్‌లో చలాన్లు కట్టుకోవచ్చు. పెండింగ్ చలాన్లను డిస్కౌంట్ రేట‌్‌లో రెండు మార్గాల్లో కట్టుకోవచ్చు. ఒకటి మీసేవా కేంద్రాలకు వెళ్లి పెండింగ్ చలాన్లను కట్టుకోవచ్చు. లేదంటే.. పోలీసు శాఖకు చెందిన వెబ్ సైట్‌లోకి వెళ్లి పెండింగ్ చలాన్లు కట్టేసుకోవచ్చు. https://echallan.tspolice.gov.in/publicview/ ఈ వెబ్ సైట్‌లోకి వెళ్లి చలాన్లు సింపుల్‌గా కట్టేసుకోవచ్చు.