జాతీయ అవార్డును అందుకున్న తెలంగాణ పర్యాటక శాఖ...

By Arun Kumar PFirst Published Nov 30, 2018, 5:07 PM IST
Highlights

ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగుతున్న జాతీయ స్థాయి స్మార్ట్ సిటీ సమ్మిట్ లో తెలంగాణ పర్యాటక శాఖ అత్యున్నత జాతీ య అవార్డును అందుకుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ తరపున హాజరైన పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ అవార్డును అందుకున్నారు.

లక్నో వేదికగా జరుగుతున్న స్మార్ట్ సిటీ సమ్మిట్ లో తె‌లంగాణ పర్యాటకు శాఖ ఎకో టూరిజం ఆండ్ టూరిస్ట్ ప్రెండ్లీ ఇనిషియేటివ్ విభాగంలో లీడర్‌షిప్ అవార్డును కైవసం చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రీటా బహుగుణ చేతులమీదుగా బుర్రా వెంకటేశం ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో యూపి ఎక్సైజ్ శాఖ మంత్రి జగ్ ప్రతాప్ సింగ్, ఎస్కే సింగ్ తదితరులు పాల్గొన్నారు.   

ఈ సందర్భంగా పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ... జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పర్యాటక శాఖకు వరుసగా అవార్డులు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ నెలలో పోర్చుగల్ లో లో జరిగిన 'ఇంటర్నేషనల్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్' లో తెలంగాణ టూరిజం బెస్ట్ టూరిజం ఫిల్మ్ అవార్డ్ ను అందుకున్న విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియా టూరిజం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ 4 జాతీయ స్థాయి అవార్డులను సాధించినట్లు వివరించారు. ఇలా తెలంగాణ పర్యాటక శాఖ తన అత్యుత్తమ పనితీరుతో టూరిస్టులను ఆకట్టుకోవడంతో పాటు అవార్డులను కూడా కైవసం చేసుకోవడం ఆనందంగా ఉందని వెంకటేశం తెలిపారు. 
 
click me!