లగడపాటివి వెకిలి సర్వేలు, ప్రజలు ఆగం కావొద్దు:కేసీఆర్

By Nagaraju TFirst Published Nov 30, 2018, 4:56 PM IST
Highlights

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విడుదల చేసిన సర్వేను టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కొట్టిపారేశారు. లగడపాటి సర్వే ఓ వెకిలి సర్వే అంటూ విరుచుకుపడ్డారు. 
 

భూపాల్ పల్లి: తెలంగాణ ఎన్నికలకు సంబంధించి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విడుదల చేసిన సర్వేను టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కొట్టిపారేశారు. లగడపాటి సర్వే ఓ వెకిలి సర్వే అంటూ విరుచుకుపడ్డారు. 

భూపాలపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ కొంతమంది సన్నాసులు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా చాలా శాపాలు పెట్టినవాళ్లు సర్వేలు అంటూ లీకులు చేస్తున్నారని అది అంతా ట్రాష్ అంటూ కొట్టిపారేశారు. 

ఆ సన్నాసులు కొన్ని వెకిలి మకిలి పిచ్చి సర్వేలు అంటూ ఏవో లీక్ లు  చేస్తున్నారని వాటిని పట్టించుకోవద్దు అన్నారు. ఆ సర్వేకు సమాధానమే భూపాలపల్లి సభ అంటూ విరుచుకుపడ్డారు. ఈ సభా ప్రాంగణంలో ఉన్న ప్రజలను చూస్తే మధుసూదనాచారి లక్ష మెజారిటీతో గెలుస్తారని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 

మరోవైపు  తెలంగాణ ఎన్నికలకు సంబంధించి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేపై లీకులు చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం సర్వే వివరాలను వెల్లడించిన రాజగోపాల్.. ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో  ప్రధాన పార్టీల ప్రలోభాలకు ఓటర్లు లోనుకావడం లేదని తెలిపారు..

ఇండిపెండెంట్ అభ్యర్థుల వైపే జనం మొగ్గు చూపుతారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 నుంచి 10 మంది స్వతంత్రులు గెలవబోతున్నారని స్పష్టం చేశారు. నారాయణ్‌పేట్‌, భోథ్‌లో ఇండిపెండెంట్లు గెలుస్తారని లగడపాటి తేల్చారు. 

రోజుకు ఇద్దరు చొప్పున గెలిచే అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తానన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను పోలింగ్ ముగిసిన తర్వాతి రోజు వెల్లడిస్తానని లగడపాటి వెల్లడించారు. అయితే తనకు రాజకీయాలతోనూ పార్టీలతోనూ సంబంధం లేదని ఆయన తేల్చారు

 

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణలో స్వతంత్రులే కింగ్‌మేకర్లు: లగడపాటి సంచలన సర్వే

click me!