TRS Plenary అవినీతి మంత్రులు తెలంగాణలో లేరు: కేసీఆర్

By narsimha lode  |  First Published Apr 27, 2022, 2:06 PM IST


టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ పలు అంశాలపై స్పందించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో దూసుకు పోతుందన్నారు. 



 హైదరాబాద్:దేశంలో చాలా రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి KCR చెప్పారు. ఎన్నో రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. టీఆర్ఎస్ సాధించిన ఈ విజయాల వెనుక ఎందరో మహానుభావులు, పార్టీ శ్రేణుల కష్టముందని కేసీఆర్ వెల్లడించారు. ఎన్నో సంక్షేమ పథకాలు మరెన్నో వినూత్న కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పనిచేయడం లేదని అన్నారు.

బుధవారం నాడు Hyderabad హైటెక్స్ హెచ్ ఐసీసీ లో జరిగిన TRS Plemay లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. అంతకు ముందు ఆయన  పార్టీ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. 

Latest Videos

undefined

ఇరవై ఒక్క ఏళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటోంది. ప్లీనరీ వేదికను చేరుకున్న గులాబీ పార్టీ అధినేత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ ప్లీనరీలో సుమారు 3వేలు పైగా తెరాస ప్రతినిధులు పాల్గొన్నారు. గులాబీ నేత కె.కేశవరావు స్వాగత ఉపన్యాసంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీని ఉద్దేశించి ప్రసంగించారు.

అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్న పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని  కేసీఆర్ చెప్పారు. నిబ‌ద్ధమైన, సువ్యవ‌స్థీత‌మై కొలువుదీరిన పార్టీ తెరాస అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోట‌ అనీ, ఎవ‌రూ కూడా దీన్ని బ‌ద్దలు కొట్టలేరన్నారు. టీఆర్ఎస్  ఒక వ్యక్తిదో, శ‌క్తిదో కాదన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజ‌ల ఆస్తి అని కేసీఆర్ వెల్లడించారు..

రాష్ట్ర సాధనలో అనేక ఒడుదొడుకులు, అవమానాలు ఎదుర్కొన్నామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఎన్నో ఛీత్కారాలను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. దేశానికి రోల్ మోడల్‌గా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అనేక ప‌ద్ధతుల్లో వెలువ‌రిస్తున్న ఫ‌లితాలు, అవార్డులు, రివార్డులే  ప‌నితీరుకు మ‌చ్చుతున‌క అని ఆయన పేర్కొన్నారు. నిన్న విడుద‌ల చేసిన ప్రక‌ట‌న‌లో దేశంలో అతి ఉత్తమ 10 గ్రామాలు తెలంగాణ‌వే నిలిచాయని తెలిపారు.

అవినీతి రహితంగా, చిత్తశుద్ధితో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామని కేసీఆర్ చెప్పారు.. పాలమూరు- రంగారెడ్డిని పూర్తి చేసుకుంటే మరింత సస్యశ్యామలమౌతుందన్నారు.అంకితభావంతో పనిచేసినందుకే రాష్ట్రంలో నేడు విద్యుత్‌ సమస్య లేదని చెప్పారుు. కర్ణాటకలో అవినీతికి పాల్పడి ఒకరు మంత్రి పదవి కోల్పోయారన్నారు. కర్ణాటక తరహా పరిస్థితి తెలంగాణలో లేదన్నారు. తెలంగాణలో అవినీతి చేసిన మంత్రులు లేరని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఒకప్పుడు 3 ప్రభుత్వ వైద్యశాలలుంటే ఇప్పుడు 33 వైద్యకళాశాలలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ కూడా ఇచ్చిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఉద్యోగ సాధన కోసం నిరుద్యోగులంతా తలమునకలుగా కష్టపడుతున్నారు. తెరాస ప్రభుత్వ స్థాయిలో కేంద్రం పనిచేసి ఉంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.14.50 లక్షలుగా ఉండేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.గొప్పలు చెప్పుకొని పొంగిపోవడం లేదన్నారు. వాస్తవాలు మాట్లాడుకుంటున్నామని అని కెసిఆర్ చెప్పారు.
 

click me!