టీడీపీకి షాక్... బీజేపీలోకి సీనియర్ నేతలు

Published : Jun 27, 2019, 08:36 AM IST
టీడీపీకి షాక్... బీజేపీలోకి సీనియర్ నేతలు

సారాంశం

తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగిలింది. తెలంగాణ టీడీపీ నేతలు పలువురు గురువారం కమలం గూటికి చేరనున్నారు

తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగిలింది. తెలంగాణ టీడీపీ నేతలు పలువురు గురువారం కమలం గూటికి చేరనున్నారు. ఇనుగాల పెద్దిరెడ్డి, చాడ సురేశ్‌రెడ్డి, బోడ జనార్దన్‌ భారతీయ జనతా పార్టీ గూటికి చేరనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో ఢిల్లీలో గురువారం కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. 

వీరితోపాటు మెదక్‌ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత శశిధర్‌రెడ్డి కూడా బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఈ నలుగురు చేరిక నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ కూడా ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి చెందిన కొన్ని జిల్లాల అధ్యక్షులు, ఇతర నేతల చేరికలు హైదరాబాద్‌లో జులై రెండోవారంలో ఉండనున్నట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం
Hyderabad Vegetable Price : ఈ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉంటాయంటే..