సీఎం కేసీఆర్ నిర్ణయం... పెరిగిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు

By telugu teamFirst Published Nov 29, 2019, 9:53 AM IST
Highlights

. ఆర్టీసీ సంస్థను గాడిన పెట్టడానికి, నష్టాల నుంచి గట్టెక్కించడానికి చార్జీలు పెంచడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. కిలో మీటర్‌కు 20 పైసలు చొప్పును పెంచుతున్నామని, డిసెంబర్ 2వ తేదీ నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు.

55 రోజుల పాటు కొనసాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. ఆర్టీసీ కార్మికులు అంతా శుక్రవారం విధుల్లో చేరాలంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు. గురువారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేర్చుకోవాలని నిర్ణయించినట్లు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

కాగా... ఆర్టీసీ సంస్థను గాడిన పెట్టడానికి, నష్టాల నుంచి గట్టెక్కించడానికి చార్జీలు పెంచడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. కిలో మీటర్‌కు 20 పైసలు చొప్పును పెంచుతున్నామని, డిసెంబర్ 2వ తేదీ నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ఈ పెంపువల్ల ఆర్టీసీకి ఏడాదికి సుమారు రూ.750 కోట్ల మేర ఆదాయం సమకూరనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 

ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఎంత ఖర్చవుతుందో తెలుసుకుందాం. అడ్వాన్స్ రిజర్వేషన్ చేస్తే అదనపు చార్జీలు వసూలు చేస్తారు.


హైదరాబాద్ - విజయవాడ సుమారు రూ.53
హైదరాబాద్ - విశాఖపట్నం సుమారు రూ.125
హైదరాబాద్ - ఒంగోలు సుమారు రూ.65
హైదరాబాద్ - వరంగల్ సుమారు రూ.30
హైదరాబాద్ - కరీంనగర్ సుమారు రూ.32
హైదరాబాద్ - నిజామాబాద్ సుమారు రూ.35
హైదరాబాద్ - ఆదిలాబాద్ సుమారు రూ.60
హైదరాబాద్ - ఖమ్మం సుమారు రూ.40

click me!