ఉపవాస దీక్షకు దిగిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

By narsimha lodeFirst Published Apr 24, 2020, 10:41 AM IST
Highlights

రైతుల సమస్యలను పరిష్కరించడంలో  రాష్ట్ర ప్రభుత్వం సరిగా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం నాడు ఒక్క రోజు ఉపవాసదీక్ష చేపట్టారు.

హైదరాబాద్: రైతుల సమస్యలను పరిష్కరించడంలో  రాష్ట్ర ప్రభుత్వం సరిగా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం నాడు ఒక్క రోజు ఉపవాసదీక్ష చేపట్టారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ నేతలంతా తమ ఇళ్లలో  ఒక్కరోజు పాటు ఉపవాస దీక్షలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ శ్రేణులను కోరారు..

లాక్ డౌన్ నేపథ్యంలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని కేసీఆర్ ప్రకటించారు. రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో ఆందోళన చెందవద్దని సూచించారు. గ్రామాల వద్దకు అధికారులు వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని ప్రభుత్వం ప్రకటించింది.

అయితే ప్రభుత్వం ప్రకటించిన విధంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు లేవని  బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

also read:నిస్వార్థ సేవ: కూకట్ పల్లి సీఐకి థాంక్స్ చెప్పిన హిమాచల్ ప్రదేశ్ సీఎం!

పంట కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు ఆందోళనలు చేస్తున్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ ఉపవాస దీక్ష చేపట్టారు.

 


 

click me!