తెలంగాణ ఆర్టీసీ బస్సుల టైమింగ్స్‌లో మార్పు: ఆపరేషన్స్ ఈడీ

By narsimha lodeFirst Published Jun 9, 2021, 5:00 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో ఈ నెల 10వ తేదీ నుండి ఆర్టీసీ బస్సులు సాయంత్రం 6 గంటల వరకు నడుపుతామని ఆర్టీసీ ప్రకటించింది.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో ఈ నెల 10వ తేదీ నుండి ఆర్టీసీ బస్సులు సాయంత్రం 6 గంటల వరకు నడుపుతామని ఆర్టీసీ ప్రకటించింది.ఈ నెల 10వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తూ  నిర్ణయం తీసుకొంది ప్రభుత్వం.

ఆంక్షలను సడలించడంతో  ఆర్టీసీ బస్సులను కూడ సాయంత్రం వరకు నడుపుతామని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు బస్సులను నడుపుతామని టీఎస్ ఆర్టీసీ  ఆపరేషన్స్ ఈడీ యాదగిరి ప్రకటించారు.

ప్రస్తుతం మధ్యాహ్నం రెండు గంటల వరకు 3600 బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ నెల 10 నుండి ఈ బస్సులను సాయంత్రం ఆరు గంటల వరకు నడుపుతామని ఆయన తెలిపారు.జీహెచ్ఎంసీ పరిధిలో బస్ పాస్ కౌంటర్లు ఉదయం ఆరున్నర గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని ఆర్టీసీ ప్రకటించింది.

click me!