వెయ్యిలోపు కోవిడ్ కేసులు:తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం

Published : Jun 28, 2021, 08:36 PM IST
వెయ్యిలోపు కోవిడ్ కేసులు:తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం

సారాంశం

తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. గత 24 గంటల్లో 993 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 6,21,606కి చేరుకొన్నాయి.కరోనాతో గత 24 గంటల్లో 9 మంది చనిపోయారు.

హైదరాబాద్:  తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. గత 24 గంటల్లో 993 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 6,21,606కి చేరుకొన్నాయి.కరోనాతో గత 24 గంటల్లో 9 మంది చనిపోయారు.తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 3,644 మంది మరణించారు. కరోనా నుండి గత 24 గంటల్లో 1417 మంది కోలుకొన్నారు. కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 6,04,093కి చేరుకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,869 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.

also read:చిత్తూరులో కరోనా ఉధృతి: ఏపీలో తగ్గిన కోవిడ్ కేసులు

గత 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 124 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్గొండలో 78, సూర్యాపేటలో 72, మంచిర్యాలలో 59, కొత్తగూడెంలో 56, ఖమ్మంలో 50, మహబూబాబాద్ లో 51 కేసులు నమోదయ్యాయి.తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు  తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ నుండి లాక్‌డౌన్ ను ఎత్తివేసింది.రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం  జాగ్రత్తలు తీసుకొంటుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తెలంగాణ సర్కార్ ప్రభుత్వం  భావిస్తోంది.


  

PREV
click me!

Recommended Stories

Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు
హైద‌రాబాద్‌లో అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఇవే.. 59 అంత‌స్తులతో మేఘాల‌ను తాకేలా