
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 405 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,52,785కి చేరుకొంది.
గత 24 గంటల్లో 80,262 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 405 మందికి కరోనా సోకిందని తేలిందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.గత 24 గంటల్లో కరోనా తో ముగ్గురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 3,845 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7,093కి చేరింది.
రాష్ట్రంలో కరోనా రోగుల రికవరీ రేటు 98.32 శాతంగా ఉంది. కరోనాతో మరణించిన వారి రేటు 0.58 శాతంగా నమోదైందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించింది. గత 24 గంటల్లో 577 మంది కరోనా నుండి కోలుకొన్నారు.
ఇప్పటివరకు కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 6,41,847కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.వరుసగా పండుగలు వస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది.అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో విద్యా సంస్థల రీ ఓపెనింగ్ కు కూడ వైద్య ఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 8వ తరగతి నుండి పీజీ వరకు ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు విద్యాశాఖ సన్నాహలను మొదలు పెట్టింది.