తిమ్మాపూర్ వాగులో కారు గల్లంతు ఘటనలో ట్విస్ట్: డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి క్షేమం, అరెస్ట్

By narsimha lodeFirst Published Aug 30, 2021, 5:43 PM IST
Highlights

వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో కారు గల్లంతైన ఘటనలో కారు డ్రైవర్  రాఘవేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.  ప్రమాదం జరిగిన తర్వాత రాఘవేందర్ రెడ్డి ఈత కొట్టుకొంటూ ఇంటికి చేరుకొన్నారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో  ట్విస్ట్ చోటు చేసుకొంది. కారు డ్రైవర్ బతికే ఉన్నాడని పోలీసులు గుర్తించారు. డ్రైవర్ రాఘవేందర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు.వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగు దాటే క్రమంలో కారు వరదలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో నవ వధువు ప్రవళ్లిక, వరుడి సోదరి శృతి మృతి చెందారు. వరుడు సహా పలువురు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో కారు డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి కూడా చనిపోయాడని తొలుత భావించారు.

also read:వికారాబాద్: వాగులో కొట్టుకుపోయిన కారు... నవ వధువు సహా నలుగురు గల్లంతు వరుడు క్షేమం

అయితే ప్రమాదం జరిగిన తర్వాత కారు డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి కారు నుండి బయటపడి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకొన్నారు. అక్కడి నుండి రాఘవేందర్ రెడ్డి ఇంటికి చేరుకొన్నారు.ఈ ఘటన జరిగిన తర్వాత డ్రైవర్  కుటుంబసభ్యులు  వాగు వద్దకు చేరుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన  పోలీసులు రాఘవేందర్ ఇంటికి వెళ్లారు.  రాఘవేందర్ క్షేమంగా ఉన్నాడని పోలీసులు గుర్తించారు. పోలీసులు రాఘవేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రాఘవేందర్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. దీంతో ఆయనను అరెస్ట్ చేశారు.

click me!