Telangana rains: భారీ వ‌ర్షాల‌తో నల్గొండలో పలు గ్రామాల మ‌ధ్య తెగిపోయిన సంబంధాలు..

By Mahesh Rajamoni  |  First Published Jul 27, 2023, 1:33 PM IST

Nalgonda: తెలంగాణ‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే నల్గొండలో భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో వాగులువంక‌లు పొంగిపోర్లుతున్నాయి. అనేక రోడ్లు దెబ్బతినడంతో ప‌లు గ్రామాల మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా మద్దిరాల వద్ద పెద్దచెరువు పొంగిపొర్లడం, రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో సూర్యాపేట-వరంగల్ మార్గంలో వాహనాలను అనుమతించడం లేదు.
 


Telangana rains: తెలంగాణ‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ క్ర‌మంలోనే నల్గొండలో భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో వాగులువంక‌లు పొంగిపోర్లుతున్నాయి.అనేక రోడ్లు దెబ్బతినడంతో ప‌లు గ్రామాల మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా మద్దిరాల వద్ద పెద్దచెరువు పొంగిపొర్లడం, రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో సూర్యాపేట-వరంగల్ మార్గంలో వాహనాలను అనుమతించడం లేదు.

వివ‌రాల్లోకెళ్తే.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు పొంగిపొర్లడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సూర్యాపేట జిల్లా మద్దిరాల వద్ద పెద్దచెరువు పొంగిపొర్లడం, రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో సూర్యాపేట-వరంగల్ మార్గంలో వాహనాలను అనుమతించడం లేదు. ఆత్మకూరు(ఎస్) మండలం ఐపూర్ వద్ద బిక్కేతు వాగు రోడ్డుపైకి ప్రవహించడంతో సూర్యాపేట- మహబూబాబాద్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, నాగారం, మద్దిరాల మండలాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది.

Latest Videos

యాదాద్రి భువనగిరి జిల్లాలో 400 మిల్లీమీటర్లు, అడ్డగూడూరులో అత్యధికంగా 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇన్ ఫ్లో 14,087 క్యూసెక్కులకు పెరగడంతో మూసీ ప్రాజెక్టు ఏడు క్రస్ట్ గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఔట్ ఫ్లో 15,238 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి జలాశయం 645 అడుగులకు గాను 642.1 అడుగులకు చేరుకుంది.

 

సూర్యాపేట జిల్లా మద్దిరాల వద్ద పెద్దచెరువు పొంగి రోడ్డుపై నీరు ప్రవహించడంతో సూర్యాపేట-వరంగల్ మార్గంలో వాహనాన్ని అనుమతించడం లేదు. pic.twitter.com/joSvYhPqkp

— Rajamoni Mahesh 🇮🇳 (@Rajamonimahesh)

 

 

click me!