బాన్సువాడలో ఓటు వేసిన మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి

sivanagaprasad kodati |  
Published : Dec 07, 2018, 08:09 AM ISTUpdated : Dec 07, 2018, 08:12 AM IST
బాన్సువాడలో ఓటు వేసిన మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి

సారాంశం

తెలంగాణ శాసనసభ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. బాన్స్‌వాడ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తన స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

తెలంగాణ శాసనసభ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. బాన్స్‌వాడ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తన స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

భార్యతో కలిసి బాన్సువాడ మండలం పోచారం గ్రామంలోని 175వ నెంబర్ పోలింగ్ బూత్‌కు ఉదయం 7 గంటలకల్లా చేరుకున్న ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోచారం మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ఓటు పవిత్రమైనదని.. ఓటు తీర్పుతో తమను పాలించే నాయకులను, ప్రభుత్వాన్ని ఎన్నుకోవచ్చని అన్నారు.

రాష్ట్ర ప్రజలకు ఈ రోజు పవిత్రమైనదని... రాబోయే ఐదేళ్లు తమను పాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకునే రోజని మంత్రి తెలిపారు.. తెలంగాణ ప్రజలందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పోచారం విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 119 శాసనసభ స్థానాల్లో... 1821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇందుకోసం 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 55,329 ఈవీఎంలు, 42,751 వీవీప్యాట్‌లు అందుబాటులో ఉంచారు. ఓటర్, పోలింగ్ బూత్‌ల సమాచారం కోసం నా ఓటు యాప్‌‌ను వినియోగించుకోవాల్సిందిగా అధికారులు తెలిపారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 279 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు, 30 వేల మంది రాష్ట్ర పోలీసులు, 5 రాష్ట్రాల నుంచి 18,860 మంది బలగాలను మోహరించారు.  దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు, బ్రెయిలీ లిపీలో ఎపిక్ కార్డ్స్, సైన్ బోర్డ్స, ర్యాంపులు ఏర్పాటు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో 2 లక్షల మంది ఉద్యోగులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా తొలిసారిగా ఓటు ఎవరికి వేశామో పోలింగ్ కేంద్రంలోనే తెలుసుకునేందుకు వీలుగా వీవీ ప్యాట్‌లను ఏర్పాటు చేశారు. సీసీటీవీ, వెబ్‌ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ | Asianet News Telugu
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?