లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన: ఒక్కరోజులోనే 1.25 లక్షల వాహనాలు సీజ్

By narsimha lodeFirst Published Apr 22, 2020, 3:15 PM IST
Highlights

 లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 1.25లక్షల వాహనాలను సీజ్ చేశారు.
 

హైదరాబాద్: లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 1.25లక్షల వాహనాలను సీజ్ చేశారు.

జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో పోలీసులు సీరియస్ గా తీసుకొన్నారు. అత్యవసర సమయాల్లోనే రోడ్లపైకి రావాలని పోలీసులు కోరారు.

రెండు రోజుల క్రితం డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి లాక్ డైన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని ప్రకటించారు. పోలీసులు చేసిన సూచనలను పట్టించుకోకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

also read:జీహెచ్ఎంసీ పరిధిలో చిన్నారులపై కరోనా పంజా: వందమందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స

ఒక్క రోజులనే 1.25 లక్షల వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా సీజ్ చేశారు. అంతేకాదు 8360 కేసులు నమోదు చేశారు. లాక్ డౌన్ పూర్తైన తర్వాత వీటన్నింటిని కోర్టుకు సమర్పించనున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.

నిత్యావసర సరుకుల కోసం తాము నివాసం ఉంటున్న ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే వాహనంపై వెళ్లాలని పోలీసులు సూచించారు. ఆసుపత్రికి వెళ్లాలంటే తమకు సమీపంలోనే ఆసుపత్రికి వెళ్లాలని కోరారు. రోడ్లపైకి వచ్చిన వారు కచ్చితంగా అడ్రస్ ప్రూఫ్ తమ వెంట తెచ్చుకోవాలని పోలీసులు సూచించారు.

click me!