జీహెచ్ఎంసీ పరిధిలో చిన్నారులపై కరోనా పంజా: వందమందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స

By narsimha lode  |  First Published Apr 22, 2020, 12:05 PM IST

కరోనా వైరస్ గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో పంజా విసురుతోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా పలువురు ఈ వైరస్ బారినపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో 14 ఏళ్లలోపు చిన్నారులు సుమారు 75 మందికి ఈ వైరస్ సోకింది.



హైదరాబాద్: కరోనా వైరస్ గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో పంజా విసురుతోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా పలువురు ఈ వైరస్ బారినపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో 14 ఏళ్లలోపు చిన్నారులు సుమారు 75 మందికి ఈ వైరస్ సోకింది. 16 ఏళ్లలోపు వారు సుమారు 70 మందికి ఈ వైరస్ సోకిందని సమాచారం.కరోనా సోకిన పిల్లలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

హైద్రాబాద్ పరిధిలోని ఆసిఫ్‌నగర్ గంజేషాహి దర్గాకు చెందిన 11 నెలల బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని ఈ నెల 17వ తేదీన ఆసుపత్రికి తీసుకొచ్చారు.  రెండు రోజుల తర్వాత ఈ నెల 19న బాలుడు మరణించాడు.  అయితే అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆ బాలుడికి కరోనా సోకిన విషయం తేలింది.

Latest Videos

undefined

నారాయణపేట జిల్లాకు చెందిన 45 రోజుల శిశువును ఈ నెల 15వ తేదీన నిలోఫర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతడికి పరీక్షలు నిర్వహిస్తే కరోనా వైరస్ సోకినట్టుగా వైద్యులు నిర్ధారించారు. 

కరోనా సోకి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి 21 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడ ఉన్నారు. కరోనా సోకిన పిల్లలు మర్కజ్ కానీ, విదేశాలకు వెళ్లినట్టుగా రికార్డులు లేవు. కానీ, వారికి ఎలా కరోనా వైరస్ ఎలా సోకిందనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. మర్కజ్ నుండి లేదా విదేశాల నుండి వచ్చిన వారి నుండి పిల్లలకు కరోనా సోకినట్టుగా వైద్యులు అనుమానిస్తున్నారు.

also read:కరోనా ఎఫెక్ట్: సూర్యాపేట మార్కెట్‌ను పరిశీలించిన సీఎస్, డీజీపీ

ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న వారిలో పెద్దలు, పిల్లలతో పాటు ముగ్గురు గర్భిణులు, ఒక బాలింత కూడా ఉంది. వీరంతా ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. 

కరోనా సోకిన నిమ్స్ లో పనిచేసే ఓ నర్సు తన ఇంట్లోని బాలుడితో సన్నిహితంగా మెలగడంతో ఆ బాలుడికి కరోనా సోకింది. దీంతో ఆ ఇంట్లో ఉన్నవారిని క్వారంటైన్ కు తరలించారు. మంగళ్ హాట్ కు చెందిన ఆటో డ్రైవర్ కొడుకు అనారోగ్యానికి గురికావడంతో  ఆసుపత్రికి తీసుకెళ్లడంతో కరోనా సోకినట్టుగా తేలింది. 

click me!