కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ గృహనిర్భందం : ఇది సీఎం అహంకారానికి పరాకాష్ట : ఉత్తమ్ కుమార్ రెడ్డి

First Published Jun 29, 2018, 5:01 PM IST
Highlights

దళితుడైనందు వల్లే సంపత్ పై కుట్రలన్న ఉత్తమ్...

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  జోగులాంబ గద్వాల జిల్లాలో ఇవాళ సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మొహరించారు. ఆయనను గృహనిర్భందం చేశారు. దీనిపై స్పందించిన ఉత్తమ్ ఓ దళిత ఎమ్మెల్యేను ఇలా గఈహనిర్భందం చేయడం సీఎం అహంకారానికి సంకేతమని అన్నారు.

 జిల్లాకు సాగు నీటి ప్రాజెక్టుల కోసం పోరాడిన ఓ దళిత ఎమ్మెల్యేనే ఇలా అవమానించడాన్ని ఆయన తప్పుబట్టారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని సంపత్ పోరాడిమరీ సాధించుకున్నారని అన్నారు. అలాగే గట్టు ఎత్తిపోతల పథకానికి కూడా ఆనాడే కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిందని, అందువల్లే ప్రభుత్వం ఇన్నిరోజులు ఈ పథకాలను పట్టించుకోలేదని ఉత్తమ్ తెలిపారు.

ఇక ఎమ్మెల్యేల సభ్యత్వం విషయంలోనూ టీఆర్ఎస్ కుట్రలు పన్నుతోందని ఉత్తమ్ అన్నారు. కోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం లెక్కచేయడం లేదని మండిపడ్డారు. దళిత ఎమ్మెల్యే సంపత్ పై కావాలనే ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఉత్తమ్ అన్నారు.

సొంత జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే సంపత్ ను పాల్గొననివ్వాలని ఆయన కోరారు. తన నియోజకవర్గంలోని సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్‌ చేశారు. 
 

click me!