అభ్యర్థిని ఎత్తుకుపోయారు: ఈసీకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు, కేసీఆర్ ఫై ఫైర్

By telugu teamFirst Published Jan 25, 2020, 4:38 PM IST
Highlights

తమ క్యాంపులో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థిని పోలీసులు ఎత్తుకెళ్లి టీఆర్ఎస్ క్యాంపులో చేర్చారని రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ మంత్రులను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు.

హైదరాబాద్: పోలీసుల తీరుపై కాంగ్రెసు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, పార్లమెంటు సభ్యుడదు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డికి ఆయన ఫోన్ చేశారు. 

కోస్గిలో తమ క్యాంప్ లో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థిని పోలీసులు టీఆర్ఎస్ క్యయాంపునకు తరలించారని ఆయన ఫిర్యాదు చేశారు. 16వ వార్డు కౌన్సిలర్ ఎల్లమ్మను బలవంతంగా తీసుకుని వెళ్లారని ఆయన ఆరోపించారు. ఇదే విషయంపై జిల్లా ఎస్పీకి కూడా ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. 

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మంత్రులను ఆంబోతుల్లా ప్రజల మీదికి వదిలారని ఆయన వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే పదవులు ఊడిపోతాయంటూ మంత్రులను ేసీఆర్ బ్లాక్ మెయిల్ చేశారని ఆయన అన్నారు. 

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రేవంత్ రెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలపై దాడులు చేసి బెదిరింపులకు పాల్పడి ఎన్నికల ఫలితాలను టీఆర్ఎస్ వైపు తిప్పుకున్నారని ఆయన అన్నారు. డబ్బులు, మద్యం, పోలీసుల అండతో టీఆర్ఎస్ గెలిచిందని ఆయన అన్నారు. 

ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి కొన్ని చోట్ల స్వతంత్రులకు మద్దతు ఇచ్చామని ఆయన చెప్పారు. కాంగ్రెసు ఎన్నో ఒడిదొడుకులు చూసిందని, రాబోయే రోజుల్లో పుంజుకుంటుందని ఆయన చెప్పారు.

ఇదిలావుంటే, మున్సిపల్ ఎన్నికల్లో కారు తన జోరును ప్రదర్శిస్తోంది. ప్రతిపక్షాలుకనీసం పోటీని కూడా ఇవ్వలేని స్థితిలో పడ్డాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 100కి పైగా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ తన జెండాను ఎగురేసింది. మొత్తం 120 మున్సిపాలిటీలు ఉన్నాయి. 

120 మున్సిపాలిటీలకు, 9 కార్పోరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. అత్యధిక మున్సిపాలిటీల్లో, కార్పోరేషన్లలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. 

click me!