దూసుకుపోతున్న టీఆర్ఎస్: మున్సిపాలిటీల్లో ఖాతా తెరిచిన కాంగ్రెసు

Published : Jan 25, 2020, 11:27 AM ISTUpdated : Jan 25, 2020, 02:34 PM IST
దూసుకుపోతున్న టీఆర్ఎస్: మున్సిపాలిటీల్లో ఖాతా తెరిచిన కాంగ్రెసు

సారాంశం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 78 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే, కాంగ్రెసు మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టింది.

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తన ఖాతా తెరిచింది. ఇప్పటి వరకు మూడు మున్సిపాలిటీలను కాంగ్రెసు గెలుచుకుంది. యాదగిరిగుట్ట, నారాయణ్  ఖేడ్, వడ్డేపల్లి మున్సిపాలీటీలను గెలుచుకుంది.

అత్యధిక మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. దీంతో హైదరాబాదులో టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఇప్పటి వరకు 78 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

ఇప్పటి వరకు టీఆర్ఎస్ గెలుచుకున్న మున్సిపాలిటీలి ఇవీ...

1.    ఐడీఏ బొల్లారం (సంగారెడ్డి జిల్లా)
2.    వర్ధన్నపేట (వరంగల్ రూరల్)
3.    బాన్సువాడ (కామారెడ్డి)
4.    కొత్తపల్లి (కరీంనగర్ ) 
5.    చెన్నూరు (మంచిర్యాల)
6.    ధర్మపురి (జగిత్యాల)
7.    పరకాల (వరంగల్ రూరల్)
8.    పెద్దపల్లి (పెద్దపల్లి జిల్లా)
9.    మరిపెడ (మహబూబాబాద్) 
10.    ఆందోల్ జోగిపేట (సంగారెడ్డి)
11.    సత్తుపల్లి (ఖమ్మం)
12.    డోర్నకల్ (మహబూబాబాద్) 
13.    భీంగల్ (నిజామాబాద్)
14.    కొత్తకోట (వనపర్తి)
15.    రాయికల్ (జగిత్యాల)
16.    ఆర్మూర్ (నిజామాబాద్)
17.    సూర్యాపేట (సూర్యాపేట)

తెలంగాణలోని 120 మున్సిపాలిటీలకు, 9 నగరపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?