ఇప్పటికే కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానంనుండి రెెబల్ గా బరిలోకి దిగి టీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ మరో షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం ఇచ్చిన ధైర్యమో లేక ఇంకేదో గానీ కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరూ పార్టీ అధిష్టానం నిర్ణయాలపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తాజాగా కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించి భంగపడ్డ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రెబల్ గా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రవీందర్ సింగ్ టీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్దంగా వున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవాళ(గురువారం) ఆయన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ బరిలో నిలుస్తానని ప్రకటించనున్నట్లు సమాచారం.
అయితే కరీంనగర్ మాజీ మేయర్ ravinder singh ను బుజ్జగించేందుకు TRS అధిష్టానం రంగంలోకి దిగింది. ఇప్పటికే దాఖలుచేసిన నామినేషన్ వెనక్కితీసుకుని పోటీనుండి తప్పుకునేలా రవీందర్ సింగ్ ను ఒప్పించే బాధ్యతను పార్టీ సీనియర్లు కొందరికి టీఆర్ఎస్ అధిష్టానం అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు ఆయనతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
undefined
karimnagar mlc ఫోటీ నుండి తప్పుకుంటే రాష్ట్రస్థాయి కార్పోరేషన్ పదవి ఇచ్చే ప్రతిపాదనను రవీందర్ సింగ్ ముందు టీఆర్ఎస్ అధిష్టానం వుంచినట్లు సమాచారం. ఈ చర్చల నేపథ్యంలోనే బుధవారం రాత్రి నుండి రవీందర్ అదృశ్యంలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రవీందర్ సింగ్ ఫోన్ స్విచ్చాప్ లో వుంది.
read more కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికపై ఈటల ఎఫెక్ట్... టీఆర్ఎస్ అలర్ట్, క్యాంప్ రాజకీయాలు షురూ
టీఆర్ఎస్ పెద్దలు రవీందర్ సింగ్ తో చర్యలు జరుపుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. రవీందర్ సింగ్ ఇంతవరకు ఎవరి కాంటాక్ట్‌లోకి కూడా వెళ్లలేదని, అతనితో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులు ఎవరూ మాట్లాడలేదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
ఇదిలావుంటే రవీందర్ సింగ్ వ్యవహారంపై చర్చించేందుకు మంత్రి గంగుల కమలాకర్ గురువారం కరీంనగర్ కార్పోరేటర్లతో సమావేశమైనట్లు తెలుస్తోంది. రవీందర్ కు వ్యతిరేకంగా వీరంతా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. రవీందర్ సింగ్ డిమాండ్లకు తలొగ్గితే తాము టీఆర్ఎస్ కు దూరమవుతామని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రవీందర్ సింగ్‌కు ప్రాధాన్యత కల్పిస్తే తాము ఇప్పటికిప్పుడు క్యాంప్ నుండి కూడా వెళ్లిపోతామని స్పష్టం చేయనున్నట్టు సమాచారం.
ఇలా రవీందర్ సింగ్ వ్యవహారం టీఆర్ఎస్ పార్టీ పెద్దలను ఇబ్బందిపెడుతోంది.ఇప్పటికే హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో నష్టనివారణ చర్యలు చేపడుతున్న అధికార పార్టీకి కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నిక మరింత తలనొప్పిని తెచ్చిపెట్టింది.
read more CM KCR: కేసీఆర్ ఎందుకు ఇంతలా జాగ్రత్త పడుతున్నారు.. ఆయన వైఖరిలో మార్పులకు కారణమేమిటి..?
ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికవగా స్థానికసంస్థల కోటాలో కూడా ఆ పార్టీ అభ్యర్ధుల గెలుపు నల్లేరుపై నడకేనని అందరూ భావించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానికసంస్థల ప్రజాప్రతినిధులే అత్యధికంగా వున్నారు. ఇలా స్ఫష్టమైన ఆధిక్యం వుంది కాబట్టి గెలుపు తమదేనని ధీమాతో వున్న అధికార పార్టీకి ప్రజాప్రతినిధులు సరికొత్త తలనొప్పిని తెచ్చి పెట్టారు. పార్టీకి వ్యతిరేకంగా కొందరు తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో అప్రమత్తమైన టీఆర్ఎస్ పార్టీ క్యాంప్ రాజకీయాలను ప్రారంభించింది.
తమకు సరైన నిధులు, ప్రాతినిధ్యం, ప్రాధాన్య లభించడం లేదంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టినట్టు కొన్ని వర్గాలు చెబుతున్నాయి.