కేసీఆర్ నెక్స్ట్ టార్గెట్ అదే : మంత్రులు సబిత, శ్రీనివాస్ గౌడ్

By Nagaraju penumalaFirst Published Nov 13, 2019, 3:56 PM IST
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే తపనతో ఉన్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అందులో భాగంగానే కేసీఆర్ ఆదేశాలతో తాము ఇక్కడ పర్యటిస్తున్నామని తెలిపారు. 
 

హైదరాబాద్: అనంతగిరి కొండలను టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న అనంతగిరి ఫారెస్టును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే తపనతో ఉన్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అందులో భాగంగానే కేసీఆర్ ఆదేశాలతో తాము ఇక్కడ పర్యటిస్తున్నామని తెలిపారు. 

అన్ని శాఖల సమన్వయంతోనే వికారాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అన్ని హంగులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.తెలంగాణ రాష్టంలోనే అనంతగిరి లాంటి ప్రాంతం ఎక్కడ లేదన్నారు మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్. 

వికారాబాద్ లో వెల్నెస్ సెంటర్ ఎర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అనంతగిరిక హవ లాకోంకా ధవా అనే నానుడి ఉందని గుర్తు చేశారు. అలాగే ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి వైద్యం పొందేవారని గుర్తు చేశారు. 

అలాంటి ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయవలసి ఉందని ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. అనంతగిరిని పర్యాటక కేంద్రం చేయాలని వికారాబాద్ ప్రజల ఎన్నోఏళ్లుగా కోరుకుంటున్నారని తెలిపారు. ప్రతి రోజు అంతగిరికి  వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారని దీన్ని పర్యాటకంగా తీర్చిదిద్దితే ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని మంత్రులు అభిప్రాయపడ్డారు.  

 ఈ వార్తలు కూడా చదవండి

వరల్డ్ టూరిజం డే... తెలంగాణకు జాతీయస్థాయిలో గౌరవం

మానేరు నదిలో కేసీఆర్ ఐలాండ్....అభివృద్దికి ఐదు కోట్లు మంజూరు

click me!