స్విమ్మింగ్ క్రీడాకారిణి గోలి శ్యామలని సత్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Siva Kodati |  
Published : Aug 25, 2021, 08:50 PM IST
స్విమ్మింగ్ క్రీడాకారిణి గోలి శ్యామలని సత్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

సారాంశం

తెలంగాణ అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని ప్రముఖ అంతర్జాతీయ వెటరన్ స్విమ్మింగ్ క్రీడాకారిణి గోలి శ్యామల కలిశారు . ఈ సందర్భంగా శ్యామలను మంత్రి సత్కరించారు. 

తెలంగాణ అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని ప్రముఖ అంతర్జాతీయ వెటరన్ స్విమ్మింగ్ క్రీడాకారిణి గోలి శ్యామల కలిశారు . ఈ సందర్భంగా శ్యామలను మంత్రి సత్కరించారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు చెందిన గోలి శ్యామల అంతర్జాతీయ స్థాయి వేదికలపై వెటరన్ స్విమ్మింగ్ విభాగంలో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకరావడం సంతోషంగా ఉందన్నారు. భారత్- శ్రీలంక దేశాల మధ్య ఉన్న హిందు మహా సముద్రంలో ఉన్న పాక్ జలసంధి (30 కిలోమీటర్లు)ని ఈదిన రెండో మహిళగా శ్యామల చరిత్ర సృష్టించారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

అదే స్పూర్తితో ప్రపంచంలోని సప్త సముద్రాలను ఈది తెలంగాణ రాష్ట్రానికి, మన దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకరావాలనే లక్ష్యంతో ఆమె శ్రమిస్తున్నారని మంత్రి చెప్పారు. ఈ క్రమంలోనే ఎంతో ప్రమాదకరమైన, అత్యంత కోల్డ్ వాటర్ కలిగిన, లోతైన ప్రాంతమైన కేటాలిన ఐలాండ్ నుండి లాస్ ఏంజెల్స్ వరకు (సుమారు 36 కిలోమీటర్లు) జరిగే స్విమ్మింగ్ అడ్వెంచర్స్ ఈవెంట్ లో పాల్గొనేందుకు వెళ్తునందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆమెను అభినందించి, సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోచ్ ఆయుష్ యాదవ్, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ కోశాధికారి ఉమేష్ లు పాల్గొన్నారు

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం