తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ తమిఃళిసైతో భేటీ కానున్నారు.యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై చర్చించనున్నారు.
హైదరాబాద్:తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారంనాడుసాయంత్రం ఐదు గంటలకు గవర్నర్ తమిళిసైతో భేటీ కానున్నారు. యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై మంత్రి సబితాఇంద్రారెడ్డి గవర్నర్ అనుమానాలను నివృత్తి చేయనున్నారు.గవర్నర్ అపాయింట్ మెంట్ ఇస్తే కలిసి ఈ విషయమై సందేహలను నివృత్తి చేస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి నిన్ననే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం మంత్రి సబితాఇంద్రారెడ్డికి గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఇవాళ సాయంత్రం గవర్నర్ తో సబితా ఇంద్రారెడ్డి భేటీ కానున్నారు.
తెలంగాణ యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు 2022 బిల్లుపై చర్చించేందుకు రావాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. అయితే ఈ విషయమై నాలుగైదు రోజులుగా వివాదం సాగుతుంది. తమకు సమాచారం ఇవ్వలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. అయితే సెప్టెంబర్ లోనే మేసేంజర్ ద్వారా ఈ విషయమై సమాచారం పంపినట్టుగా రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి. ఈ విషయాలపై తెలంగాణ గవర్నర్ నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
గవర్నర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం బయటకు రావడంతో గవర్నర్ అపాయింట్ మెంట్ కోసం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ,విద్యాశాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ బిల్లు విషయమై గవర్నర్ తో చర్చించాలని ప్రభుత్వం నుండి సమాచారం వచ్చిందని నిన్న మధ్యాహ్నం మంత్రి సబితాఇంద్రారెడ్డి చెప్పారు. ప్రభుత్వం నుండి వచ్చిన సమాచారం ఆధారంగా గవర్నర్ తో చర్చించేందుకు విద్యాశాఖ అధికారులతో మంత్రిసబితా ఇంద్రారెడ్డి నిన్ననే అధికారులతో సమావేశమయ్యారు. గవర్నర్ ఇవాళ అపాయింట్ మెంట్ ఇవ్వడంతో ఇవాళ సాయంత్రం భేటీ కానున్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.ఈ బిల్లుపై గవర్నర్ తమిళిసైసౌందరరాజన్ యూజీసీకి కూడ లేఖ రాసింది. యూనివర్శిటీల్లో ఏళ్లుగా పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని గవర్నర్ ప్రశ్నించారు. ప్రతి బిల్లును అధ్యయం చేసిన తర్వాత ఆమోదిస్తున్నట్టుగా గవర్నర్ చెప్పారు.
also read:నేడు మీడియా సమావేశం:గవర్నర్‌తో భేటీకి సంకేతాలిచ్చిన మంత్రి సబితా
బిల్లులను ఉద్దేశ్యపూర్వకంగా ఆపలేదని గవర్నర్ చెప్పారు. కొత్తగా రిక్రూట్ మెంట్ బోర్డు ఎందుకుఅనేదే తనక అర్ధం కాలేదని గవర్నర్ నిన్న చెప్పారు. ఈ విషయాలపై తాను అన్ని యూనివర్శిటీల వీసీలతో మాట్లాడిన విషయాన్నిగుర్తు చేశారు. ఈ విషయమై నివేదికను కూడా ప్రభుత్వానికి పంపినట్టుగా ఆమె నిన్న మీడియా సమావేశంలో వివరించారు.తెలంగాణ రాష్ట్రంలోని పలు యూనివర్శిటీల్లో గవర్నర్ గతంలో పర్యటించారు.విద్యార్ధులు కూడా రాజ్ భవన్ కు వచ్చి గవర్నర్ తో భేటీ అయ్యారు.