TS Inter 1st Year Results: ఫెయిలైన విద్యార్ధులకు ఊరట, అందరూ పాస్... సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన

Siva Kodati |  
Published : Dec 24, 2021, 06:38 PM IST
TS Inter 1st Year Results: ఫెయిలైన విద్యార్ధులకు ఊరట, అందరూ పాస్... సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన

సారాంశం

ఇంటర్ ఫస్టియర్‌లో అందరినీ పాస్ చేస్తున్నట్లు సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మినిమం మార్కులతో అందరినీ పాస్ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు

ఇంటర్ ఫస్టియర్‌లో అందరినీ పాస్ చేస్తున్నట్లు సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మినిమం మార్కులతో అందరినీ పాస్ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి నిర్ణయం వుండదని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణలో (telangana) ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై (telangana inter 1st year results) గందరగోళం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (sabitha indra reddy) మీడియా ముందుకు వచ్చారు. 

కోవిడ్‌తో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొందని ఆమె తెలిపారు. ఇంటర్ ఫస్టియర్‌లో 51 శాతం మంది విద్యార్ధులు ఫెయిల్ అయ్యారని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కోవిడ్ సంక్షోభం కారణంగా గత రెండేళ్లుగా డిజిటల్ క్లాసులు నిర్వహించామని ఆమె గుర్తుచేశారు. దూరదర్శన్ ద్వారా మారమూల పల్లెల్లో కూడా విద్యార్ధులకు క్లాసులు నిర్వహించామని సబిత చెప్పారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి పిల్లలు, టీచర్ల మధ్య సమన్వయం చేశామన్నారు. కోవిడ్ కారణంగా టెన్త్, ఇంటర్ విద్యార్ధుల్ని ప్రమోట్ చేశామని మంత్రి తెలిపారు. కీలకమైన ఇంటర్‌ సెకండియర్‌లోనూ ప్రమోట్ చేశామని సబితా ఇంద్రారెడ్డి గుర్తుచేశారు. గురుకులాల్లోనూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. టీ శాట్ వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్‌లోనూ పాఠాలు అందుబాటులో వుంచామని.. విద్యార్ధులకు టెన్షన్ తగ్గించేందుకు కౌన్సెలింగ్ ఇచ్చామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. 

Also Read:ఫెయిలైన ఇంటర్ విద్యార్థులకు న్యాయం కోసం: ఇంటర్ బోర్డు వద్ద జగ్గారెడ్డి దీక్ష

సెకండియర్ పరీక్షలకు ముందుకు విద్యార్ధులను సిద్ధం చేయాలని అనుకున్నామని.. అందుకే మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు. 49 శాతం మంది విద్యార్ధులు పాస్ అయ్యారని చెప్పారు. పది వేల మంది 95 శాతం మార్కులు సాధించారని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 2014 నుంచి 2020 వరకు 59 శాతం మంది 68 శాతమే ఉత్తీర్ణత సాధించారని ఆమె తెలిపారు. ఇంటర్ బోర్డును అనవసరంగా విమర్శించారని.. నిందించే ముందు రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలని సబిత హితవు పలికారు. డిగ్రీ పరీక్షలపై కూడా కోర్టుకు వెళ్లారని.. డిగ్రీ పరీక్షలు రాయకుంటే వారి భవిష్యత్తు ఏంటో ఆలోచించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu