కొత్త రికార్డు కొట్టిన తెలంగాణ మంత్రి పోచారం

First Published Apr 25, 2018, 7:57 PM IST
Highlights

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కొత్త రికార్డు నెలకొల్పారు

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కొత్త రికార్డు నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒకేరోజు 713 ట్రాక్టర్లు పంపిణీ చేశారు. యంత్రలక్ష్మీ పథకం క్రింద జిల్లాలోని రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఇతర యంత్ర పరికరాలను పంపిణీ చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జుక్కల్ శాసనసభ్యుడు హన్మంత్ షిండే, జిల్లా పరిషత్ చైర్మన్ ధఫేదార్ రాజు, జిల్లా రైతు సమన్వయ సమితీ కన్వీనర్ దుద్దిల అంజిరెడ్డి,  జిల్లా కలెక్టర్ యన్. సత్యనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఒక్క జిల్లాలో ఒకే రోజు 713 ట్రాక్టర్లను పంపిణీ చేయడం మొదటిసారి అని చెప్పారు. దేశంలో వ్యవసాయ రంగానికి ఇంత భారీ ఎత్తున సబ్సీడీలను అందిస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధి రైతుల మేలు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. రూ. 5,500 కోట్ల ఖర్చుతో 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నామన్నారు. 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించింది రైతుల మేలు కోసమేనని చెప్పారు.

లక్షా యాబై వేల కోట్ల రూపాయలతో కోటి ఎకరాలకు సాగునీరందించడానికి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతుబంధు పథకం కోసం బడ్జెట్ లో రూ. 12,000 కోట్లు కెటాయించారని గుర్తు చేశారు. రైతులు రెండు పంటలు వెస్తారు కావున రాష్ట్రంలోని కోటి యాబై లక్షల ఎకరాలకు ఏటా రెండు పంటలకు కలిపి రూ. 8,000 అందిస్తామన్నారు. రైతులు కూడా వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకొవాలని సూచించారు.

భవిష్యత్తులో రైతులు అప్పులు కోసం బ్యాంకుల చుట్టూ తిరగడం కాదు, రుణం తీసుకోండని సూచించారు. జిఎస్టీ పెరిగింది ట్రాక్టర్ల రేట్లు పెంచమని కంపెనీల యజమానులు అడిగితే కుదరదు, గత ఏడాది రేట్ల ప్రకారమే పంపిణీ చేయమని గట్టిగా చెప్పడంతో వారు ఒప్పుకున్నారని వివరించారు. ఎద్దులతో వ్యవసాయం తగ్గిపోయింది కాబట్టి భవిష్యత్తులో వ్యవసాయం పూర్తిగా యంత్రపరికరాలతోనే జరుగుతుందన్నారు. రాష్ట్రం మొత్తానికి 56,000 ట్రాక్టర్లు అవసరం కాగా కామారెడ్డి జిల్లాకు 2000 ట్రాక్టర్లు అవసరమన్నారు. ఏటా కొంత చొప్పున రాష్ట్రానికి అవసరమైన ట్రాక్టర్లను పంపిణీ చేస్తామన్నారు.

click me!