బీఆర్ఎస్ ను ఏర్పాటు చేసింనదున తమపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ప్రయోగించే అవకాశం ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తమపై ఈడీ, సీబీఐ,ఐటీ సంస్థలను వేట కుక్కల్లా ప్రయోగించే అవకాశం ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.అన్నింటికి తాము సిద్దంగా ఉన్నామన్నారు.
శుక్రవారం నాడు తెలంగాణమంత్రి కేటీఆర్ హైద్రాబాద్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ నుఏర్పాటు చేసినందున తమపై కేంద్రం కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఆపార్టీని వీడనున్నారని చెప్పారు. ప్రధానప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైందని చెప్పారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ జోడో యాత్ర చేయాలని కేటీఆర్ సెటైర్లు వేశారు. కేరళలో రాహుల్ భారత్ జోడోయాత్ర చేస్తుంటే గోవాలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పక్క బీజేపీలో చేరారన్నారు.
దేశంలో రాజకీయ శూన్యత ఉందని ఆయన చెప్పారు. ఇప్పుడు తమ పార్టీపేరు మార్చుకున్నామన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలే తమ పార్టీ టార్గెట్ గా పనిచేస్తుందన్నారు. ఈ ఎన్నికలలోపుగా బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఎదుగుతుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా కంపెనీ రూ. 22వేల కోట్ల కాంట్రాక్టు తీసుకుందన్నారు. రూ. 5 వేల కోట్లు ఖర్చు పెడతానని అమిత్ షా కు కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాకు మాట ఇచ్చారన్నారు. మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని మంత్రి గుర్తుచేశారు.
దేశంలో 10 వేల మంది మొబైల్ ఫోన్ ట్యాప్ అవుతున్నాయని కేటీఆర్ చెప్పారు. ఇందులో కిషన్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అవుతుందన్నారు. బీజేపీ మల్టీ ఫేసెడ్ పార్టీగా ఆయన పేర్కొన్నారు. బీ.జేపీ జాతీయ పార్టీ అయినా ఈ పార్టీని నడిపించేది గుజారాతీలని కేటీఆర్ విమర్శించారు.
దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ ని అమలు చేస్తామన్నారు. గుజరాత్ మెడల్ ఫేక్ మోడల్ అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశమంతా అమలు చేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతుందని కేటీఆర్ చెప్పారు.
సరిహద్దు రాష్ట్రాల ప్రజలు వాళ్ళ జిల్లాలను తెలంగాణ లో కలపాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కు మద్దతు పెరుగుతుందన్నారు.
సుజనా చౌదరి,సీఎం రమేష్ పైన ఉన్న కేస్ లు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. అంత వాషింగ్ పౌడర్ నిర్మా లాగానే ఉంది బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీరు అంటూ ఆయన విమర్శించారు.