రెచ్చగొట్టడం వల్లే సునీల్ ఆత్మహత్య: విపక్షాలకు కేటీఆర్ కౌంటర్

Published : Apr 12, 2021, 05:05 PM IST
రెచ్చగొట్టడం వల్లే సునీల్ ఆత్మహత్య: విపక్షాలకు కేటీఆర్ కౌంటర్

సారాంశం

ఉద్యోగాల పేరుతో విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు.   

వరంగల్:ఉద్యోగాల పేరుతో విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. వరంగల్ లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో సోమవారం నాడు మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విపక్షాల విమర్శలకు కౌంటరిచ్చారుకొందరు నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ వయస్సులో సగం కూడ లేని వారు కేసీఆర్ ను విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఇక నుండి కేసీఆర్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. తగిన బుద్ది చెబుతామని ఆయన తేల్చి చెప్పారు.   బోడ సునీల్ అనే యువకుడి ఆత్మహత్య గురించి కూడ కేటీఆర్ ప్రస్తావించారు. రెచ్చగొట్టడం వల్లే సునీల్ చనిపోయాడని ఆయన చెప్పారు.బ్రెయిన్ వాష్ చేయడం వల్లే సునీల్  కేసీఆర్ గురించి మాట్లాడారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఐఎఎస్ కావాల్సిన వాడినని  సునీల్ ఆ వీడియోలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఐఎఎస్ పోస్టులను భర్తీ చేసే నోటిఫికేషన్లు ఎవరు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. మోడీ ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఎక్కడ ఉన్నారని ఆయన అడిగారు

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే