లండన్ నుంచి దావోస్‌కు.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల కోసం బయల్దేరిన మంత్రి కేటీఆర్

Published : May 22, 2022, 08:05 PM IST
లండన్ నుంచి దావోస్‌కు.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల కోసం బయల్దేరిన మంత్రి కేటీఆర్

సారాంశం

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఈ రోజు లండన్ నగరం నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు జరిగే దావోస్‌కు బయల్దేరి వెళ్లారు. లండన్‌లోని హీత్రో విమానాశ్రయం నుంచి జ్యూరిచ్‌కు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దావోస్‌కు వెళ్తారు. ఈ మేరకు మంత్రి బృందానికి టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ, ఇతర ఎన్ఆర్ఐలు వీడ్కోలు పలికారు.

న్యూఢిల్లీ: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఈ రోజు యూకేలోని లండన్ నగరం నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయల్దేరారు.  పెట్టుబడులను ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ నుంచి విదేశీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్ నాలుగు రోజుల పాటు లండన్‌లో పలు కీలక కంపెనీలతో సమావేశాలు నిర్వహించారు. అనంతరం ఈ రోజు ఆయన లండన్ నుంచి స్విట్జర్లాండ్‌కు బయల్దేరి వెళ్లారు. లండన్ హీత్రో విమానాశ్రయం నుంచి జ్యూరిచ్‌కు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దావోస్‌కు ఈ రోజు రాత్రి చేరుకుంటారు. 

రేపటి నుంచి దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు జరుగుతాయి. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ ప్రపంచంలోని పలు కీలక కంపెనీలతో సమావేశం అవుతారు. మూడు రోజుల పాటు జరిగే ప్రధాన సమావేశ మందిరాల్లో జరిగే చర్చల్లో పాల్గొంటారు. ఆ తర్వాత 26వ తేదీన స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరంలో ప్రముఖ కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం అవుతారు.

కాగా, లండన్ నుంచి స్విట్జర్లాండ్2కు బయల్దేరిన మంత్రి బృందానికి టీఆర్ఎస్ ఎన్‌ఆర్ఐ శాఖ కార్యకర్తలు, ఇతర ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున వీడ్కోలు పలికారు.

ఇదిలా ఉండగా, దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఏపీ సీఎం వైఎస్  జగన్ బిజిబిజీగా గడుపుతున్నారు. దీనిలో భాగంగా పలువురు ప్రముఖులతో ఆయన భేటీ అయ్యారు. ఈ క్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆయన చర్చలు జరిపారు. వీరితో పాటు బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హాన్స్ పాల్, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే, వరల్డ్ ఎకనమిక్ ఫోరం మొబిలిటీ అండ్ సస్టైనబిలిటీ విభాగాధిపతి పెట్రో గొమేజ్, హెల్త్ విభాగాధిపతి డాక్టర్ శ్యామ్ బిషేన్‌లతోనూ జగన్ భేటీ అయ్యారు. 

అంతకుముందు స్విట్జర్లాండ్‌లోని (switzerland) దావోస్‌లో జరుగుతున్న (jagan davos tour) ప్రపంచ ఆర్ధిక సదస్సులో (world economic forum summit 2022)  ఏపీ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను (ap pavilion) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) ఆవిష్కరించారు. ఆదివారం జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు. అంతకుముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సమావేశంలో జగన్  పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?
Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు