ప్రధానితో కేటీఆర్ భేటీ: విభజన హమీ చట్టం అమలు చేయాలని వినతి

First Published Jun 27, 2018, 3:32 PM IST
Highlights

రాష్ట్ర సమస్యలపై ప్రధానితో కేటీఆర్ భేటీ

న్యూఢిల్లీ: విభజన హమీ చట్టంలోని హమీలను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి  కేటీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు.బుధవారం నాడు న్యూఢీల్లీలో కేటీఆర్ లో ప్రధానమంత్రిని కలిశారు. 

విభజన చట్టంలోని హామీలు సహా పలు అంశాలను మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. సమావేశమనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. విభజన హామీలు అమలు చేయాలని ప్రధానిని కోరామన్నారు. ఐటీఐఆర్ ఏర్పాటును వేగవంతం చేయాలని ప్రధాని మోదీని కోరామని తెలిపారు. 

ఐటీఐఆర్‌కు కేంద్రం సహకరిస్తే మరింత వేగంగా ముందుకెళ్తామని ప్రధానికి తెలిపామన్నారు. ఐటీఐఆర్‌కు మౌలిక వసతులు కల్పించాలని కోరినట్లు చెప్పారు. హామీల విషయంలో చొరవ తీసుకుని పరిష్కరించాలని కోరినట్లు పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ హామీలు, 10 ప్రతిపాదనలను ప్రధాని ముందు ఉంచినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం అంశంలో ఇటీవలే ప్రధాని మరింత సమాచారం అడిగారు. బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో ప్రధానికి నివేదిక అందించినట్టు చెప్పారు.

విభజన చట్టంలో పేర్కొన్న విధంగా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఏర్పాటు చేయాలని ఈ నెల 15న సీఎం కేసీఆర్ ప్రధానికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

click me!