అడ్డంగా మాట్లాడినా కేబినెట్‌లోనే,ఆయనది ఆత్మవంచన: ఈటలపై కేటీఆర్ సంచలనం

Published : Jul 14, 2021, 02:12 PM ISTUpdated : Jul 14, 2021, 02:46 PM IST
అడ్డంగా మాట్లాడినా కేబినెట్‌లోనే,ఆయనది ఆత్మవంచన: ఈటలపై కేటీఆర్ సంచలనం

సారాంశం

మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. పార్టీలోనే ఈటల రాజేందర్ కొనసాగేలా తాను చివరివరకు ప్రయత్నించినట్టుగా  కేటీఆర్ గుర్తు చేశారు.


అమరావతి:ఈటలకు టీఆర్ఎస్ ఎంత చేసిందో ఆత్మ విమర్శ చేసుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్  కోరారు.బుధవారం నాడు టీఆర్ఎస్ భవన్ లో  మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్ సందర్భంగా ఈటల రాజేందర్ ఎపిసోడ్ పై ఆయన స్పందించారు. 

ఈటల రాజేందర్ పార్టీలోనే ఉండేందుకు చివరివరకు ప్రయత్నించానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేబినెట్ నిర్ణయాలను ఈటల తప్పుబట్టారని చెప్పారు. కేసీఆర్ తో ఐదేళ్ల నుండి గ్యాప్ ఉంటే ఎందుకు కేబినెట్ లో కొనసాగారని ఆయన ప్రశ్నించారు.  అడ్డంగా మాట్లాడినా కూడ ఈటల రాజేందర్ ను కేబినెట్ లో కేసీఆర్  కొనసాగించారని చెప్పారు.ఈటలకు టీఆర్ఎస్ ఎంత చేసిందో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఈటల రాకముందు కూడా కమలాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలంగా ఉందని ఆయన గుర్తు చేశారు.

అనామకుడు ఉత్తరం రాస్తే ఈటలపై చర్యలు తీసుకోలేదన్నారు. రాజేందర్ ది ఆత్మ వంచన అని ఆయన అభిప్రాయపడ్డారు. తప్పు చేయలేదని చెబుతూనే ఆయన తాను చేసిన తప్పును ఒప్పుకొన్నారని  ఈటల ఒప్పుకొన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఆయనపై ఎందుకు సానుభూతి వస్తోందని మంత్రి ప్రశ్నించారు. బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలన్నారు.జల వివాదాల్లో న్యాయమే గెలుస్తోందన్నారు. ఒక్కో వారంలో కొందరు వ్రతాలు చేస్తారు, షర్మిల కూడ అలానే చేస్తోందని ఆయన సెటైర్లు వేశారు.

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్