తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఎందుకు నోరు మెదపరు: బీజేపీ నేతలపై కేటీఆర్ ఫైర్

By narsimha lodeFirst Published Mar 7, 2021, 1:52 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్న  సమయంలో ఎవరు ఎందుకు  నోరు మెదపలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 
ఆదివారం నాడు ఎమ్మెల్సీ అభ్యర్ధి సురభి వాణికి మద్దతుగా కేటీఆర్ ఇవాళ హైద్రాబాద్ లో  నిర్వహించిన బ్రహ్మణుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. 


హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్న  సమయంలో ఎవరు ఎందుకు  నోరు మెదపలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 
ఆదివారం నాడు ఎమ్మెల్సీ అభ్యర్ధి సురభి వాణికి మద్దతుగా కేటీఆర్ ఇవాళ హైద్రాబాద్ లో  నిర్వహించిన బ్రహ్మణుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. 

రాష్ట్రానికి చెందిన లక్షలాది పిల్లల నోట్లో మట్టి కొట్టారని ఆయన కేంద్రంపై దుమ్మెత్తిపోశారు. నాటి ప్రధానిపై మోడీ విమర్శలు చేసి.. ఇవాళ అదే తప్పును మోడీ కూడా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం గుండు సున్నా ఇచ్చిందన్నారు. జీడీపీ పెరగడం అంటే గ్యాస్, డీజీల్, పెట్రోల్ రేట్లు పెరగడమేనా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ను ఇష్టానుసారం తిడుతున్నారని ఆయన చెప్పారు.

 విభజన హామీలను అమలు చేయలేదన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలతో పాటు చట్టాలను కూడ అమలు చేయలేదని ఆయన కేంద్రంపై మండిపడ్డారు.మాణిని గెలిపించాలని కోరుతూ కొందరు  చేస్తున్న ప్రచారాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశంసించారు. 

click me!