ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో బీజేపీకి డిపాజిట్ కూడ దక్కదు:మంత్రి జగదీష్ రెడ్డి

By narsimha lode  |  First Published Oct 31, 2022, 7:57 PM IST

మునుగోడులో డబ్బులతోనే గెలవాలని బీజేపీ  కలలు కంటుందని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. మునుగోడులో తమ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని మంత్రి చెప్పారు.


హైదరాబాద్: ఓడిపోతామనే భయంతో మునుగోడులో  బీజేపీ అనేక  కుట్రలు చేస్తుందని తెలంగాణ  మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో బీజేపీకి డిపాజిట్ కూడా  దక్కదన్నారు.

సోమవారంనాడు తెలంగాణ  భవన్ లో తెలంగాణ  మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మునుగోడుకు ఏం  చేశామో  బీజేపీ  నేతలు ఇంతవరకు  చెప్పారా అని  ఆయన ప్రశ్నించారు.భవిష్యత్తులో ఏం చేస్తారో చెప్పారా  అని ఆయన అడిగారు.మునుగోడు అభివృద్ది  కోసం  ఏం  చేశామో తాము చెప్పామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణకు ఉపయోగపడే ఏ  ఒక్క పనిని బీజేపీ చేయలేదన్నారు.బండి సంజయ్ ,కిషన్ రెడ్డి, లక్ష్మణ్  లు నోటికొచ్చిన అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి  జగదీష్ రెడ్డి చెప్పారు.

Latest Videos

undefined

బీజేపీ నేతలు అబద్దాలతో బతుకుతున్నారన్నారు.కూల్చడం ,మంట పెట్టడమే బీజేపీ విధానమని మంత్రి జగదీష్ రెడ్డి   మండిపడ్డారు.బీజేపీ  పాలనలో  దేశం అట్టడుగు స్థానానికి చేరుకుంటుందని  ఆయన విమర్శించారు.ఎన్నికల్లో ఓడిపోతుందనే  భయం పట్టుకుందన్నారు. అందుకే  బీజేపీ నేతలు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. చేనేతపై జీఎస్టీ ఎత్తివేస్తామని ఏ ఒక్క బీజేపీ నేత మాట్లాడలేదన్నారు.ఎనిమిదేళ్లైనా కృష్ణా నదిలో  తెలంగాణ వాటా తేల్చలేదన్నారు.సీబీఐ బీజేపీ అనుబంధ సంస్థగా మారిందని ఆయన  ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో దర్యాప్తునకు గతంలో ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకున్నామని మంత్రి చెప్పారు.మునుగోడులో డబ్బులతో గెలవాలని బీజేపీ అనుకొంటుందన్నారు. కానీ, బీజేపీకి డిపాజిట్ కూడా  దక్కదని  ఆయన ధీమాను వ్యక్తం  చేశారు. 

also read:మునుగోడులో రూ. 6.80కోట్ల నగదు సీజ్,185 కేసులు: తెలంగాణ సీఈఓ వికాస్ రాజు

నిర్మించడం,అన్నం పెట్టడం,  నీళ్లివ్వడం టీఆర్ఎస్  పని  అని మంత్రి జగదీష్ రెడ్డి  చెప్పారు.మునుగోడులో ఫ్లోరైడ్  మహమ్మారిని తరిమికొట్టిన ఘనత సీఎం కేసీఆర్ దేనని జగదీష్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ  పాదయాత్ర ఎంరుకు చేస్తున్నారో ఎవరికీ అర్ధం  కావడం లేదన్నారు.మునుగోడులో కాంగ్రెస్ కార్యకర్తలకు ధైర్యమిచ్చే దమ్ము కూడా  రాహుల్ గాంధీకి లేదని ఆయన విమర్శించారు.

click me!