Telangana Assembly Budget Session 2022 ఫెడరల్ స్పూర్తికి దెబ్బ: బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం పై హరీష్ ఫైర్

Published : Mar 07, 2022, 12:01 PM IST
Telangana Assembly Budget Session 2022 ఫెడరల్ స్పూర్తికి దెబ్బ: బడ్జెట్ ప్రసంగంలో  కేంద్రం పై హరీష్ ఫైర్

సారాంశం

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రంపై ఫైరయ్యారు. బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం తీరును హరీష్ రావు ఎండగట్టారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను హరీష్ రావు సోమవారం నాడు ప్రవేశ పెట్టారు

హైదరాబాద్: కో ఆపరేటివ్ ఫెడరల్ స్పూర్తి అని గొప్పగా చెబుతూ ఫెడరల్ స్పూర్తిని కేంద్రం దెబ్బతీసిందని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Harish Rao విమర్శించారు. 

తెలంగాణ వార్షిక బడ్జెట్ ను  రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం నాడు Telangana Assembly Budget 2022 ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా హరీష్ రావు కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయని విషయాన్ని ప్రస్తావించారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన సమయంలోనే తెలంగాణకు చెందిన మండలాలను Andhra Pradeshలో కలిపారన్నారు.  అడుగడుగునా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందన్నారు. ఐదేళ్ల పాటు హైకోర్టును విభజించకుండా కేంద్రం తాత్సారం చేసిందన్నారు.

ఆర్ధిక సంఘం ఇచ్చిన సూచనలను కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మిషన్ భగీరథ, Mission Kakatiya లకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని సూచించినా కూడా కేంద్రం పట్టించుకోలేదన్నారు. కానీ రూ. 24 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. జహీరాబాద్ లో నిమ్స్ కు కేంద్రం వాటా రూ. 500 కోట్లు ఇవ్వలేదని చెప్పారు.సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అగచాట్లు పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా  దూసుకెళ్తుందని హరీష్ రావు చెప్పారు. సవాళ్లు, క్లిష్టమైన సమస్యలను అధిగమిస్తూ రాష్ట్రం పురోగమిస్తుందని హరీష్ రావు తెలిపారు. పరిపాలనలో టీఆర్ఎస్ రాజీలేని వైఖరిని అవలంభించిందన్నారు.  విద్యుత్ కోతల నుండి 24 గంటల పాటు విద్యుత్ ను ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ ముందుకు సాగుతుందని హరీష్ రావు చెప్పారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం టార్చ్ బేరర్ గా  నిలిచిందన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన Union Budget 2022 లో కూడా తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేవని  హరీష్ రావు చెప్పారు. FRBM పరిమితిని పెంచుతూనే ఆంక్షలను విధించారని హరీష్ రావు చెప్పారు.Corona సమయంలో కూడా ఒక్క పైసా కూడా కేంద్రం ఇవ్వలేదన్నారు. కేంద్రం తీరుతో రాష్ట్రం ప్రతి ఏటా 5 వేల కోట్లు నష్టపోతోందన్నారు.  ఈ ఐదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం రూ. 25 వేల కోట్లు నష్టపోతుందని హరీష్ రావు వివరించారు.  వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం విద్యుత్ సంస్కరణలకు తెర తీసిందన్నారు. అయితే ఈ విద్యుత్ సంస్కరణలకు తాము ఒప్పుకోబోమని కేంద్రానికి కేసీఆర్ తెగేసి చెప్పారని హరీష్ రావు గుర్తు చేశారు.  తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన డబ్బును సెస్ ల రూపంలో దోచుకొంటుందని హరీష్ రావు కేంద్రంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా