ధాన్యంపై డొంక తిరుగుడు మాటలొద్దు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్

By narsimha lodeFirst Published Nov 23, 2021, 5:00 PM IST
Highlights


కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి  సీరియస్ వ్యాఖ్యలు చేశారు. రైతులకు సమస్యలు లేవని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

 మెదక్:  వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ నేతలు రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు.మంగళవారం నాడు ఆయన మెదక్ జిల్లాలో  మీడియాతో మాట్లాడారు.   గల్లీ బీజేపీ నేతలు వరి వేయాలంటున్నారని ఢిల్లీ బీజేపీ నేతలు వరి వేయొద్దంటున్నారన్నారు.  రైతులను బీజేపీ నేతలు అయోమయానికి గురిచేస్తున్నారని మంత్రి harish rao ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను కించపరిచే విధంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రం యాసంగిలో paddy కొంటామని అంటోందని, యాసంగిలో బాయిల్డ్ రైస్ వస్తుంది కానీ.. రా రైస్ రాదనే విషయం కిషన్‌రెడ్డికి తెలియదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులకు సమస్య లేదని కిషన్‌రెడ్డి అనడం సరికాదన్నారు. గ్రామాల్లోకి వచ్చి చూస్తే రైతుల సమస్యలు తెలుస్తాయని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.

also read:వడ్లే కాదు, నీటి పంచాయతీపైనా తేల్చాలి : కేసీఆర్‌పై భట్టి విక్రమార్క ఆగ్రహం

రైతుల జీవితాల బాగు కోసం సీఎం kcr తపన పడుతుంటే మీకు రాజకీయంగా కనిపిస్తుందా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. బీజేపీ 1998 లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేసింది. మరీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు.కేంద్ర మంత్రి kishan reddy డొంక తిరుగుడు మాటలు చెప్పి రైతులను ఆగం చేయాలని చూస్తున్నారని మంత్రి విమర్శించారు. గతంలో కొన్న వడ్లు ఇంకా గోడౌన్ లలో ఉన్నాయన్నారు. కిషన్ రెడ్డికి రైతుల మీద ప్రేమ ఉంటే రైల్వే అధికారులతో మాట్లాడి వాటిని త్వరగా ఇక్కడి నుండి బయటకు పంపాలి..

గతంలో అధికారంలో ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వలు యసంగిలో వడ్లు కొన్నారని ఆయన గుర్తు చేశారు. అందుకే ఇప్పుడు తాము అడుగుతున్నామన్నారు.కొంతమంది నేతలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు.రైతుల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు.  ఎరువుల ధరలను పెంచి,డీజిల్ ధరలను పెంచి రైతులను కేంద్రం ఇబ్బంది పెడుతుందన్నారు. మెదక్ జిల్లాలో ఇప్పటికే 2లక్షల 70 వేల క్వింటాల వడ్లు కొన్నట్టుగా మంత్రి చెప్పారు. 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై 

ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో trs పార్టీనే విజయం సాధిస్తుందని  మంత్రి మంత్రి హరీశ్‌రావు అన్నారు.medak జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుందన్నారు. మూడో వంతు మెజార్టీ మాకే ఉందన్నారు.మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ కు 777 ఓట్లున్నాయని చెప్పారు. ఎన్ని పార్టీలు నామినేషన్లు దాఖలు చేసినా కూడా తమకు ఇబ్బంది లేదన్నారు.  ఎవరి బలం ఏంటో త్వరలోనే  తెలుస్తుందని మంత్రి హరీష్ రావు చెప్పారు.

తమ పార్టీకి సంపూర్ణ బలం ఉందని చెప్పారు.  మొదటిసారి ఎన్నికల కమిషన్ ఈ సారి ఎమ్మెల్యేలకు కూడా ఓటు హక్కు కల్పించనుందని తెలిపారు.  ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా జగ్గారెడ్డి సతీమణి నిర్మల జగ్గారెడ్డి పోటీ చేయనున్నారు.
 

click me!