హుజూరాబాద్ ఉప ఎన్నిక: కొండా సురేఖ అభ్యర్ధిత్వం వైపే కాంగ్రెస్ నేతల మొగ్గు

By narsimha lode  |  First Published Aug 30, 2021, 2:51 PM IST


హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్ధి ఎంపిక విషయమై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. సదానంద, కొండా సురేఖ,కృష్ణారెడ్డి ల పేర్లను  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. పార్టీ ముఖ్యులతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జీ మాణికం ఠాగూర్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో  హుజూరాబాద్ అభ్యర్ధి ఎంపిక విషయమై చర్చించారు. కొండా సురేఖ వైపే మెజారిటీ నేతలు మొగ్గు చూపారని సమాచారం.



హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప  ఎణ్నికల్లో బరిలో దింపే అభ్యర్ధి విషయమై కాంగ్రెస్ పార్టీ ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహరాల ఇంచార్జీ  మాణికం ఠాగూర్  ఆదివారనం నాడు తెలంగాణ పర్యటనకు వచ్చారు.కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన నేతలతో మాణికం ఠాగూర్  సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై చర్చించారు.

సోమవారం నాడు గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో  హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అభ్యర్ధి ఎంపికతో పాటు దళిత, గిరిజన ఆత్మగౌరవ సభల తేదీల విషయమై చర్చించారు.

Latest Videos

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి కొండా సురేఖ పేరును కాంగ్రెస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. సదానంద, కృష్ణారెడ్డిల పేర్లను కూడ పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. అయితే కొండా సురేఖ వైపే పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది.  కొండా సురేఖ ఈ స్థానంలో పోటీ చేస్తే బలమైన అభ్యర్ధి అవుతారని  మెజారిటీ నేతలు అభిప్రాయపడినట్టుగా సమాచారం. పార్టీ నేతల అభిప్రాయాన్ని పార్టీ చీఫ్ సోనియాగాంధీకి అందించనున్నారు మాణికం ఠాగూర్.హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్ధిగా ఈటల రాజేందర్ బరిలో దిగనున్నారు.  కాంగ్రెస్ పార్టీ ఇంకా తన అభ్యర్ధిని ఖరారు చేయలేదు.

click me!