మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇలాకా హూజూరాబాద్ ప్రజాప్రతినిధులతో మంత్రి గంగుల కమలాకర్ భేటీ అయ్యారు. ఈటల గెలిచినా, తాను గెలిచినా కేసీఆర్ ఫొటోతోనే అని ఆయన అన్నారు.
కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ టీఆర్ఎస్ కార్యకర్తలతో మంత్రి గంగుల కమలాకర్ బేటీ అయ్యారు. వారిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. వ్యక్తులు పార్టీ నుంచి వెల్లిపోయినంత మాత్రాన నష్టం ఏదీ జరగదని ఆయన అన్నారు.
హుజూరాబాద్ కార్యకర్తలంతా టీఆర్ఎస్తోనే ఉన్నారని ఆనయ చెప్పారు. టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఉందని ఆయన చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా ఉందని, వరుస ఎన్నికల్లో విజయాలే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. కేసీఆర్ ఫోటోతో ఎన్నికల్లో గెలుస్తామని ఆనయ చెప్పారు.
undefined
మంత్రివర్గం ముంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన తర్వాత హుజూరాబాద్ శానససభా నియోజకవర్గంపై టీఆర్ఎస్ అధిష్టానం దృష్టి పెట్టింది. క్యాడర్ చెదిరిపోకుండా చూసుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగాంగనే గంగుల కమలాకర్ టీఆర్ఎస్ క్యాడర్ తో సమావేశమయ్యారు.
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు మరింత బలోపేతమవుతుందని ఆయన చెప్పారు. అధికారం చేపట్టి ఏడేళ్లు పూర్తయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదని, ప్రజల్లో కేసీఆర్ మీద అచంచల విశ్వాసం వ్యక్తమవుతుందని అన్నారు. తనని కలిసిన హుజురాబాద్ పార్టీ ప్రజా ప్రతినిదులతో కరీంనగర్ క్యాంప్ ఆఫీస్ లో మంత్రి మాట్లాడారు.
కేసీఆర్ పనితీరుకు, ప్రభుత్వ పనితీరుకు రెపరెండంగా వరుస ఎన్నికల విజయాలే తార్కాణమన్నారు.ఎన్నికలేవైనా టీఆర్ఎస్నే ప్రజలు ఆదరిస్తున్నారని, కేసీఆర్ పోటోనే మా గెలుపు మంత్రమన్నారు. మెన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 70శాతం తెలంగాణ ప్రజల విశ్వాసంతో ఘన మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని, అనంతరం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఇదే నిరూపితమయిందన్నారు.
నాగార్జునసాగర్లో జానారెడ్డే గెలుస్తాడని అందరూ చెప్పినా... టీఆర్ఎస్ అభ్యర్థి కేవలం కేసీఆర్ పోటోతో భారీ మెజార్టీతో గెలిచిన విషయాన్ని గంగుల గుర్తుచేశారు.కేసీఆర్ వెంటే పార్టీ మెత్తం ఉందని, ఎన్నికలేవైనా కేసీఆర్ పోటోనే తమ గెలుపుమంత్రమన్నారు.
కరీంనగర్లో తాను గెలిచినా, హుజురాబాద్లో ఈటెల గెలిచినా అది కేవలం కేసీఆర్ వల్లే సాద్యమయిందన్నారు. ప్రజలకు కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలే గెలుపు బాటలు వేస్తున్నాయని చెప్పారు, కల్లాల్లో పండుతున్న పంటల్లో, కాల్వల్లో పారుతున్న నీళ్లల్లో కేసీఆర్ ని ప్రజలు చూస్తున్నారని, కళ్యాణలక్ష్మీ, రైతు బందు, రైతు బీమల్లో కేసీఆర్ ప్రభుత్వం సుస్థిరంగా ఉందన్నారు. వ్యక్తులు ముఖ్యం కాదని పార్టే ముఖ్యమన్నారు గంగుల.
హుజురాబాద్లో ఈటెల వల్ల ఎలాంటి నష్టం లేదని, క్యాడర్లో ఎవరికీ అనుమానాలు లేవని, అందరూ పూర్తిగా దీమాతో ఉన్నారని అన్నారు. పూర్తిగా పార్టీతో, టీఆర్ఎస్ తోనే వారు ఎప్పుడూ ఉంటారని స్పష్టం చేశారు. పార్టీ స్థానికంగా చాలా బలంగా ఉందని, ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు మంత్రి గంగుల.
హుజురాబాదులో పార్టీ క్యాడర్ కు అండగా ఉంటామని, వారికి నిరంతంర అంధుబాటులో ఉంటామని, భవిష్యత్లో పార్టీ తీసుకొనే నిర్ణయానికి పూర్తిగా అందరం కట్టుబడి ఉంటామని స్పష్టంచేశారు. ఈటెల వ్యవహారంలో పార్టీ త్వరలోనే అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటుందని, పుట్ట మదు వ్వవహారంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబందం లేదని, హైకోర్టులో వామన్ రావు గారి తండ్రి పిర్యాదు మేరకు చట్టం తన పని తాను చేస్తుందని, జరుగుతున్న వ్యవహారాల్లో పార్టీకి ప్రభుత్వానికి ఎలాంటి సంబందం లేదని అన్నారు.ఎన్నికలేవైనా ఇంతలా ఆదరిస్తున్న తెలంగాణ ప్రజానీకానికి మంత్రి గంగుల ధన్యవాదాలు తెలియజేశారు.
కాగా, ఈటల రాజేందర్ హుజురాబాద్ శానసభా సభ్యత్వానికి ఇప్పుడిప్పుడే రాజీనామా చేసే పరిస్థితి లేదు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిన తర్వాత రాజీనామాపై ఆలోచన చేస్తానని ఆయన చెప్పారు. అదే సమయంలో ఆయన కొత్త పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. హుజూరాబాద్ వెళ్లి వచ్చిన తర్వాత ఆయన షామీర్ పేటలోని తన నివాసంలో వివిధ వర్గాలతో, పలువురు ప్రముఖులతో భేటీ అవుతున్నారు.