ఆదిలాబాద్ లో కలకలం.. థియేటర్ లో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు..!

Published : Mar 19, 2022, 09:29 AM IST
ఆదిలాబాద్ లో కలకలం.. థియేటర్ లో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు..!

సారాంశం

యువకులు పాకిస్తాన్‌కి అనుకూలంగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ఆగ్రహం చెందిన తోటి ప్రేక్షకులు నినాదాలు చేస్తున్న ఇద్దరిని చితకబాదారు.  

ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేగింది. ఆదిలాబాద్   జిల్లా కేంద్రంలోని నటరాజ్ థియేటర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూస్తుండగా ఇద్దరు యువకులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది. 

సీట్ నంబర్లు సీ-7, సీ-8లో కూర్చున్న యువకులు పాకిస్తాన్‌కి అనుకూలంగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ఆగ్రహం చెందిన తోటి ప్రేక్షకులు నినాదాలు చేస్తున్న ఇద్దరిని చితకబాదారు.

దీంతో ఆ ఇద్దరు థియేటర్‌లో నుంచి బయటికి పరారయ్యారు. నాలుగు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో ఆకతాయిలు గొడవ జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?