కాంగ్రెస్ కు ఇంకా బుద్ది రాలేదు: కర్ణాటక పరిణామాలపై గుత్తా సుఖేందర్ రెడ్డి

By narsimha lode  |  First Published May 16, 2023, 10:38 AM IST

తెలంగాణలో  కాంగ్రెస్, బీజేపీ  ఎన్ని పన్నాగాలు  పన్నినా  ప్రజలు  బీఆర్ఎస్  వెంటే ఉంటారని  శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  చెప్పారు. 


నల్గొండ: కర్ణాటక  అసెంబ్లీ  ఎన్నికల ఫలితాలు  వచ్చి  నాలుగు రోజులైనా  సీఎంను తేల్చలేని పరిస్థితి కాంగ్రెస్ కు ఉందని  తెలంగాణ శాసనమండలి చైర్మెన్  గుత్తా సుఖేందర్ రెడ్డి  ఎద్దేవా  చేశారు.

మంగళవారంనాడు  నల్గొండలోని  తన క్యాంప్ కార్యాలయంలో  గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కర్ణాటక వ్యవహరం చూస్తే  కాంగ్రెస్ కు  ఇంకా  బుద్ధి రాలేదని  తేలిందన్నారు. . నాలుగు రోజులైనా ఇంకా కర్ణాటక లో  సీఎం ని నిర్ణయించే స్వేచ్ఛ ఆ పార్టీ లో లేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ  దేశానికి ఎలాంటి నాయకత్వం వహిస్తుందో  అనేది ప్రజలు  ఆలోచన చేయాలని సుఖేందర్ రెడ్డి  కోరారు.   కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ లో కాంగ్రెస్ నేతలు  ఊహల్లో ఉన్నారని  సుఖేందర్ రెడ్డి  చెప్పారు.

Latest Videos

రాజస్థాన్ లో కాంగ్రెస్ కల్లోలం చూస్తూనే ఉన్నామన్నారు.  అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులే తిరుగు బాటు చేసి రాజకీయ అస్థిరత్వం తెస్తున్నారని  సుఖేందర్ రెడ్డి గుర్తు  చేశారు.  అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ పార్టీ  కునారిల్లి పోతుందని  సుఖేందర్ రెడ్డి  చెప్పారు. 

తెలంగాణ లో కాంగ్రెస్  ,బీజేపీ పార్టీల  పప్పులు ఉడకవన్నారు.  కేసీఆర్ వెంటే  తెలంగాణ సమాజం నడుస్తుందని  సుఖేందర్ రెడ్డి తెలిపారు.   మతోన్మాద బీజేపికి, దిక్కు దివానా లేని కాంగ్రెస్ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన  ప్రజలను  కోరారు.  

 ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ నాయకత్వమే శరణ్యంగా  ఆయన పేర్కొన్నారు.కర్ణాటక లో బీజేపీకి ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. అయినా కూడా బీజేపీ వైఖరిలో మార్పు రాలేదన్నారు. తెలంగాణలో అస్సాం సీఎం  బిశ్వంత్ శర్మ  చేసిన  వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. .మత కల్లోలాలు లేపి ఎలాగైనా అధికారంలోకి రావాలని  బీజేపీ పార్టీ  కుట్రగా  సుఖేందర్ రెడ్డి  చెప్పారు.

రెండు  దఫాలు  వామపక్షాలు  లేకుండా  రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్టుగా  సుఖఏందర్ రెడ్డి  చెప్పారు. రానున్న ఎన్నికల్లో  రాష్ట్రంలో  బీఆర్ఎస్  100 సీట్లను కైవసం  చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
 

click me!