నాగార్జునసాగర్ బైపోల్‌లో అసత్యప్రచారం: జానారెడ్డిపై గుత్తా ఫైర్

By narsimha lodeFirst Published Apr 5, 2021, 3:49 PM IST
Highlights

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని  తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  ఆరోపించారు.
 

నల్గొండ: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని  తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  ఆరోపించారు.

శాసనమండలి ఛైర్మెన్ సుఖేందర్ రెడ్డి సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టకుండా ఎన్నికల ప్రచారం చేయాలని ఆయన కోరారు.నెల్లికల్ ప్రాజెక్టు కోసం  జానారెడ్డి ఒక్కరే తపన పడినట్టుగా చెప్పడం ఆశ్చర్యాన్ని కల్గించిందన్నారు. టీఆర్ఎస్ మంత్రసానితనం పోషించిందని చెప్పడం సబబుకాదని ఆయన చెప్పారు.టీఆర్ఎస్‌లో గెలిచి పదవులు అనుభవించి కాంగ్రెస్‌లో ఎందుకు చేరారో చెప్పాలని ఆయన జానారెడ్డిని డిమాండ్ చేశారు.డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను కట్టించలేదని ప్రశ్నించే హక్కు జానారెడ్డికి లేదని ఆయన చెప్పారు.

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 17వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం ప్రధాన పార్టీలు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డిని బరిలోకి దింపింది. బీజేపీ డాక్టర్ రవికుమార్ ను బరిలోకి దింపింది. టీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య తనయుడు భగత్ ను బరిలోకి దింపింది. 
 

click me!