Telangana: తెలంగాణలో ఈ కోర్సులు చేశారంటే జాబ్‌ పక్కా!

Published : May 06, 2025, 08:53 AM IST
Telangana: తెలంగాణలో ఈ కోర్సులు చేశారంటే జాబ్‌ పక్కా!

సారాంశం

తెలంగాణలో 2025–26 విద్యా సంవత్సరం నుంచి కొత్త డిగ్రీ కోర్సులు ప్రారంభమయ్యాయి. నెలకు రూ.6,000–10,000 ఇంటర్న్‌షిప్, ఉద్యోగ హామీతో అందుబాటులోకి వచ్చాయి.

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన కమిషనరేట్ ఆఫ్ కాలేజియట్ ఎడ్యుకేషన్ 2025–26 విద్యా సంవత్సరానికి అనుగుణంగా కొత్త డిగ్రీ కోర్సులను ప్రారంభించింది. ఈ కోర్సులు స్కిల్-ఆధారిత విద్యను అందిస్తూ, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా రూపొందించారు.

ఈ కొత్త కోర్సులు రాష్ట్రవ్యాప్తంగా 28 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో  అందుబాటులోకి రానున్నాయి. అందులో B.Com బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ & ఇన్సూరెన్స్ (BFSI), B.Com ఈ-కామర్స్ ఆపరేషన్స్, B.Com రిటైల్ ఆపరేషన్స్, B.Sc టూరిజం & హాస్పిటాలిటీ ఆపరేషన్స్, B.Sc డిజిటల్/ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, B.Sc మార్కెటింగ్ & సేల్స్, B.Sc ఫార్మాస్యూటికల్ మాన్యుఫాక్చరింగ్ & క్వాలిటీ, అలాగే BBA ఇన్ కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్ వంటి కోర్సులు ఉన్నాయి.

రూ.6000 నుంచి రూ.10,000 వరకు

ఈ కోర్సుల ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి కోర్సులోనూ శిక్షణ (Apprenticeship Embedded Programmes) భాగంగా ఉంటుంది. విద్యార్థులు ఈ కోర్సులు పూర్తిచేసే సమయంలో, వారికి నెలకు రూ.6,000 నుంచి రూ.10,000 వరకు చెల్లించే ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా, కోర్సు ముగిసిన తర్వాత ఒక నిశ్చిత ఉద్యోగ అవకాశాన్ని కూడా హామీ ఇస్తున్నారు.

కమిషనరేట్ ప్రకారం, ఈ కోర్సులు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, ప్రాక్టికల్ స్కిల్స్‌ను పెంపొందించడంలో దోహదపడతాయి. 2019లో ప్రారంభమైన ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (CBCS) కారణంగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని జీడీసీసీ నివేదికలో పేర్కొంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కళాశాలల్లో అడ్మిషన్లు 80 శాతం వరకు పెరిగాయని వివరించింది.

ఈ కార్యక్రమాలు విద్యార్థులకు కేవలం విద్య నేర్పించడమే కాకుండా, ప్రత్యక్షంగా ఉద్యోగ ప్రపంచంలోకి ప్రవేశించేందుకు తగిన అవగాహన, అనుభవాన్ని కూడా కల్పిస్తాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ముందడుగు, విద్యా రంగంలో ఒక వినూత్న మార్పుకు నాంది పలికే అవకాశముంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu