పవన్ కాదు ప్యాకేజీ కళ్యాణ్ : తెలంగాణ జర్నలిస్టులు ఫైర్

Published : May 11, 2018, 03:54 PM IST
పవన్ కాదు ప్యాకేజీ కళ్యాణ్ : తెలంగాణ జర్నలిస్టులు ఫైర్

సారాంశం

హైదరాబాద్ లో ర్యాలీ

పవన్ కళ్యాణ్ పై తెలంగాణ జర్నలిస్టులు నిరసన తెలిపారు. హైదరాబాద్ లో బషీర్ బాగ్ చౌరస్తా నుంచి సిటీ పోలీసు కమిషనరేట్ వరకు ర్యాలీ నిర్వహించి పవన్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పవన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పవన్ కళ్యాణ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను నిరసించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీద చర్యలు తీసుకోవాలని కమిషనర్ అంజని కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. 

"

పవన్ కళ్యాణ్ పై ఇచ్చిన ఫిర్యాదులపై  కమిషనర్ సానుకూలంగా స్పందించారు. నిపుణుల కమిటీ ని నియమిస్తున్నామని, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా త్వరలోనే చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు జర్నలిస్టు నేతలు చెప్పారు.  

ఈ సందర్బంగా  మీడియా ప్రతినిధి హరి కిరణ్ మాట్లాడుతూ  ప్రభుత్వానికి ప్రజలకు వారధి గా వున్న మీడియా పై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. పవన్ కళ్యాణ్ ఇలాంటి దాడు లకు పాల్పడితే తీవ్ర మైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. మీడియా గొంతును నొక్కుతూ, చానళ్ళ వాహనాలను ద్వాంసం చేసి, విలేకరుల పై భౌతిక దాడులు చేస్తూ ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గిస్తున్న పవన్ కళ్యాణ్ ను వెంటనే అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో లోకల్ రిపోర్టర్స్ ప్రతినిధి బాగిలి సత్యం. సీనియర్ జర్నలిస్ట్ గోపి యాదవ్, శ్రీకాంత్,శ్యామ్ సుందర్, మనోజ్, రాఘవ, దశరథ్, లక్ష్మీ కాంత్, రాము, రాజు,  సాయి, హమ్సరాజు వినయ్ సింగ్ తదితరలు పాల్గొన్నారు. ర్యాలీ వీడియో పైన ఉంది చూడండి.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?