ప్రపంచంలో భారతదేశ పరువు పోతుంది, అమిత్ షాకి చెప్పా: సిఏఏపై కేసీఆర్

By telugu teamFirst Published Jan 25, 2020, 6:35 PM IST
Highlights

సెక్యూలర్ పార్టీ కాబట్టి పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకరించామని అన్నారు. కేంద్రం తీసుకున్న తప్పుడు నిర్ణయం ఇది అని అన్నారు. ముస్లింలను పక్కకు పెట్టడాన్ని వ్యతిరేకరిస్తామని ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. 

సెక్యూలర్ పార్టీ కాబట్టి పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకరించామని అన్నారు. కేంద్రం తీసుకున్న తప్పుడు నిర్ణయం ఇది అని అన్నారు. ముస్లింలను పక్కకు పెట్టడాన్ని వ్యతిరేకరిస్తామని ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. 

కాశ్మీర్ అంశంలో అది దేశ భద్రత అంశంలో అవసరం కాబట్టి దాన్ని సపోర్ట్ చేసినట్లు చెప్పారు. త్వరలోనే బీజేపీ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు కెసిఆర్. 

ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైతే దాన్ని సమీక్ష చేయకుండా మొండిపట్టుదల మంచిది కాదని, తాము కూడా అసెంబ్లీలో ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయనున్నట్టు తెలిపారు. 

అంతర్జాతీయ మార్కెట్లో భారత్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే ఆస్కారం ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఎదురయితదని, మనల్ని విదేశాల్లో థర్డ్ గ్రేడ్ సిటిజన్స్ గా పరిగణించే ఆస్కారం కూడా లేకపోలేదని ఒక ఆంగ్ల స్కాలర్ వ్యాసాన్ని ఉటంకిస్తూ చెప్పారు కెసిఆర్. 

ఈ బిల్లు కరెక్ట్ కాదు. ఎన్నార్సి, ఎన్పిఆర్ ఏదో వేరు అని హోమ్ మినిస్టర్ చెబుతున్నారని  కానీ వాస్తవానికి ఎన్నార్సికి  ఎన్పిఆర్ తొలిమెట్టని హోమ్ మినిస్ట్రీకి చెందిన డాక్యూమెంటే పేర్కొంటుందని అన్నారు కెసిఆర్. 

భారత రాజ్యాంగ పీఠిక స్ఫూర్తికే విరుద్ధంగా ఈ చట్టం ఉందని కెసిఆర్ అన్నారు. ప్రధాని మోడీకి ఈ వేదికగా ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్టు తెలిపారు.

భైంసాలో ఏదో గొడవ జరుగుతే దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టడం ఏమిటని అన్నారు. ఎకానమీ నాశనమవుతుంటే... హిందువులు ముస్లిమ్స్ అని గొడవలు పెడుతూ, వాటి ఆధారంగా రాజకీయాలు చేయడం సరికాదన్నారు. 

బీజేపీ ఎంపీలు మరీ ముక్కులు కోసేస్తాము, అసదుద్దీన్ గడ్డం తీసేసి తనకు అతికిస్తానని చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించాడు కెసిఆర్. మమ్మల్ని అంతు చూస్తామంటే తమ క్యాడర్ గనుక విరుచుకుపడితే.. బీజేపీ పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు. 

 

click me!