తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల: ఆగస్టు 19, 20లలో పరీక్ష

Siva Kodati |  
Published : Apr 03, 2021, 02:35 PM IST
తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల: ఆగస్టు 19, 20లలో పరీక్ష

సారాంశం

రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఐసెట్‌ నోటిఫికేషన్‌ శనివారం విడుదలైంది. కంట్రోలర్‌ మహేందర్‌రెడ్డి ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 7 నుంచి జూన్‌ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఐసెట్‌ నోటిఫికేషన్‌ శనివారం విడుదలైంది. కంట్రోలర్‌ మహేందర్‌రెడ్డి ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నెల 7 నుంచి జూన్‌ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ. 250 అపరాధ రుసుముతో జూన్‌ 30 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో జులై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబరు 17న ఫలితాలు విడుదల చేస్తామని మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 13 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 14 రీజినల్‌ సెంటర్లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే 60 కేంద్రాలను గుర్తించినట్లు మహేందర్‌రెడ్డి ప్రకటించారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Weather Update : కనుమ రోజు కనువిందు చేసే వెదర్.. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం
హైదరాబాద్‌లో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్ | Sankranthi Food Festival Reaction | Asianet News Telugu