
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మరో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మూడు రోజుల్లో 9 మందికి కరోనా సోకింది. క్రైమ్ విభాగంలో పనిచేసే ఐదుగురు ఒకేసారి వైరస్ బారిన పడ్డారు.
తాజాగా ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లకు వైరస్ సోకింది. మొదటిదశ కరోనా సమయంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో 50 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. రెండో దశ వేగంగా విస్తరిస్తుండడంతో మిగతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.