తీర్పుపై ఉత్కంఠ: ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వంపై తేల్చనున్న హైకోర్టు

By Arun Kumar PFirst Published Dec 16, 2020, 10:03 AM IST
Highlights

వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై తెలంగాణ హైకోర్టు ఇవాళ తేల్చనుంది. 

సిరిసిల్ల: కేంద్ర హోంశాఖ తన పౌరసత్వంపై జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నేడు(బుధవారం) హైకోర్టు విచారణ జరిపి తుది తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు కూడా కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశిస్తే మాత్రం వేములవాడలో ఉపఎన్నిక  తప్పదు. ఇప్పటికే రంగంలోకి దిగిన ప్రధాన పార్టీలుహైకోర్టు తీర్పుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

మరోవైపు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను అమలు చేయాలని ఇంప్లీడ్ పిటీషనర్ ఆది శ్రీనివాస్ హైకోర్టును కోరుతున్నారు. భారత పౌరుడు కానీ వ్యక్తి ఎమ్మెల్యే గా ఎన్నిక కావడాన్ని ఆది శ్రీనివాస్ తప్పుబడుతున్నారు. రిట్ పిటీషన్ పెండింగ్ లో ఉన్న సమయంలో చెన్నమనేని జర్మనీ పాస్ పోర్టుతో జర్మనీ కి వెళ్లారని ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ విషయాన్ని కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొనలేదన్నారు ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది.

జర్మనీ పాస్ పోర్టు తో పాటు జర్మనీ పౌరసత్వం ఇంకా చెన్నమనేని రమేష్ కలిగి ఉన్నాడా..?రద్దు చేసుకున్నాడా? అని గతంలో హైకోర్టు ప్రశ్నించింది. భారతీయ పౌరసత్వం పొందిన తర్వాత భారత పాస్ పోర్టు పొందాడా..? తెలపాలని హైకోర్టు కోరింది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం, పాస్ పోర్టు పై పూర్తి సమాచారం తెలపాలని కేంద్ర హోంశాఖ కు గతంలో హైకోర్టు అదేశించింది. జర్మనీ, భారత రాయబారి కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు తెలపాలని హైకోర్టు ఆదేశించింది.

కోర్టు ఆదేశాలతో ఇవాళ(బుధవారం) విచారణలో పూర్తి వివరాలు కౌంటర్ అఫిడవిట్ ద్వారా కేంద్ర హోంశాఖ సమర్పించనుంది. ఈ నేపథ్యంలో చెన్నమనేని  రమేష్ పౌరసత్వం పిటీషన్ పై హైకోర్టు లో కీలక ప్రకటన రానున్నట్లు సమాచారం.

click me!